Bandi Sanjay : రాహుల్ కు ధీటుగా.. అమిత్ షా కు జనసమీకరణ

Bandi Sanjay

Bandi Sanjay

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పార్టీ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్‌, ఎంపీ బండి సంజయ్‌ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు ప్లాన్‌ చేస్తున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో నిర్వహించనున్నారు. అయితే..ఈ సభకు కేంద హోంశాఖ మంత్రి అమిత్‌ షా రానుండడంతో ఈ సభ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

బహిరంగ సభకు భారీ జన సమీకరణతో సత్తా చాటేందుకు తెలంగాణ బీజేపీ సిద్ధమైంది. బూత్ అధ్యక్షుడు సహా ప్రతి పోలింగ్ బూత్‌కు 0 మంది చొప్పున కార్యకర్తలు జన సమీకరణ చేసే దిశగా బీజేపీ నేతలు కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గానికి 5 వేల చొప్పున జన సమీకరణ చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా, మండల, రాష్ట్ర నేతలతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి… కనీవినీ ఎరగని రీతిలో ముగింపు సభను సక్సెస చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రేపటి నుండి కరెంట్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ర్యాలీలు, నిరసనలు చేప్టటాలని ఆదేశించారు. దళిత బిడ్డ నాగరాజు హత్యోదంతంపైనా ఊరూవాడ నిరసన తెలపాలని బండి సంజయ్ సూచించారు.

LIVE: ఆరోజు పబ్‌లో ఏం జరిగిందంటే.. నిహారిక ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ