నిన్న ఎన్డీఏ తరుఫున రాజ్యసభకు నలుగురు దక్షిణాది ప్రముఖుల పేర్లు ప్రకటిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. తాజాగా ఆయన.. ప్రముఖ సంగీత స్వరకర్త ఇళయరాజా, మాజీ ఒలింపిక్ క్రీడాకారిణి పీటీ ఉష, ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్, ఆధ్యాత్మిక, సామాజికవేత్త వీరేంద్ర హెగ్డే రాజ్యసభకు నామినేట్ కావడంపట్ల బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. అత్యంత సాధారణ కుటుంబ నేపథ్యం నుండి వచ్చి తమ తమ రంగాల్లో అత్యంత ప్రతిభా పాటవాలు కనబరుస్తూ భారతీయులకు ప్రేరణ కలిగిస్తున్న ఇళయరాజా, పీటీ ఊష, విజయేంద్రప్రసాద్, వీరేంద్ర హెగ్డేలను రాజ్యసభకు నామినేట్ చేయడం మనందరికీ గర్వకారణమని ఆయన వెల్లడించారు.
Gold Rate Today : పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
గతంలో సంపన్నులకు, పైరవీ కారులకే అత్యుతన్నమైన పద్మ అవార్డులు దక్కేవని, రాజ్యసభకు నామినేట్ చేసే వారనే ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ.. ఊహకే అందని విధంగా అతి సాధారణ కుటుంబ నేపథ్యం కలిగి తమ తమ రంగాల్లో విశేష సేవలందిస్తున్న ఎంతోమందికి పద్మ అవార్డులు అందించిన ఘనత నరేంద్రమోదీ ప్రభుత్వానికే దక్కుతుందని బండి సంజయ్ కొనియాడారు. తాజాగా అదే కోవకు చెందిన నలుగురు దక్షిణాది వారిని సైతం రాజ్యసభ సభ్యులగా నామినేట్ చేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలకు బీజేపీ తెలంగాణ శాఖ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రాజ్యసభకు నామినేట్ అయిన వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నామని బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు.
