Bandi sanjay: ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో ఢిల్లీలో బండి సంజయ్ ఉన్నారు. మరి మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులపై ఆయన స్పందించారు. కమిషన్ కు బండి సంజయ్ లేఖ రాశారు. నేను కమిషన్ ముందుకు హాజరు కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? లేఖలో పేర్కొన్నారు. సంబందించిన వివరాలు ఇవ్వాలని కోరారు. నేను విచారణ కు హాజరు అవ్వడానికి ముందే ఆ వివరాలు ఇస్తే నేను కమిషన్ ముందు వివరణ ఇచ్చేందుకు నాకు సులభం అవుతుందని పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యం లో ఈ నెల 15 న హాజరు కాలేనని స్పష్టం చేశారు. ఈ నెల 18 న హాజరు అవుతానని తెలిపారు. ఆ రోజు కమిషన్ ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు వచ్చి వివరణ ఇస్తానని బండి సంజయ్ లేఖలో వివరించారు.
Read also: Payyavula Keshav: గవర్నర్ ప్రసంగంలో 3 రాజధానుల అంశం ఎందుకు లేదు..?
కాగా.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు రాష్ట్ర మహిళా కమిషన్ సోమవారం నాడు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. ఈ నెల 15న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని కూడా బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్థించబోనని వ్యాఖ్యనించారు. ఈ వ్యాఖ్యలను సుమోటోగా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తీసుకుంది. ఈ నెల 15 తేదీన విచారణకు రావాలని మహిళా కమిషన్ నోటీసులను జారీ చేసింది. అయితే మహిళా కమిషన్ నోటీసులకు బండి సంజయ్ రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది.
Pidamarthi Ravi: వెన్నుపోటు పొడవడం సండ్రకు అలవాటే.. బీఅర్ ఎస్ లో ఉంటారనే గ్యారెంటీ లేదు