Site icon NTV Telugu

Bandi sanjay letter to CM Kcr: సీఎంకు బండి సంజయ్‌ లేఖ

Bandi Sanjay Letter To Cm Kcr

Bandi Sanjay Letter To Cm Kcr

bandi sanjay letter to cm kcr: ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. ప్రధానమంత్రినరేంద్రమోదీ ఆర్దికంగా వెనుకబడ్డ అగ్రకుల పేదలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన సంగతిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని బండి సంజయ్ పేర్కొన్నారు.

Read also: Adimulapu Suresh: ఏపీ వ్యాప్తంగా వికేంద్రీకరణ ఉద్యమం ఉధృతం చేస్తాం

రాష్ట్ర ప్రభుత్వం తీరువల్ల ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని అన్నారు. పోలీస్ రిక్రూట్ బోర్టు నోటిఫికేషన్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇచ్చి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఇవ్వకపోవడం దారుణం అని లేఖలో పేర్కొన్నారు. తక్షణమే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇస్తూ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను సవరించాలని డిమాండ్‌ చేశారు.
Asaduddin Owaisi: టిప్పు సుల్తాన్ చరిత్రను తుడిచేయలేరు.. కండోమ్‌లు ఎక్కువగా ఎవరు వాడుతున్నారు..?

Exit mobile version