Site icon NTV Telugu

Bandi Sanjay: గవర్నర్ వ్యవస్థను కేసీఆర్‌ ఎత్తేస్తారేమో..?

తెలంగాణ సర్కార్‌-రాజ్‌భవన్‌ మధ్య క్రమంగా దూరం పెరుగుతూ పోతోంది… గవర్నర్‌ తమిళిసై బహిరంగంగానే ప్రభుత్వం, ప్రభుత్వాధినేతలపై విమర్శలు గుప్పించడం.. ఈ మధ్యే హస్తినలో పర్యటించి.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమైన తర్వాత.. టార్గెట్‌ రాష్ట్ర ప్రభుత్వం అనే తరహాలో ఆమె చేసిన వ్యాఖ్యలు చేయడం చర్చగా మారింది.. అయితే, అదే రేంజ్‌లో టీఆర్‌ఎస్‌ నుంచి కౌంటర్‌ ఎటాక్‌ స్టార్ట్‌ అయ్యింది.. ఈ నేపథ్యంలో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేవారు.. రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వారు గవర్నర్ వ్యవస్థను గౌరవిస్తారన్న ఆయన.. సీఎం కేసీఆర్‌ ఒకవేళ ప్రధాని అయితే గవర్నర్ వ్యవస్థను ఎత్తేస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు.

Read Also: Singareni: సింగరేణి బోర్డు కీలక నిర్ణయాలు.. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే..

ఇక, గవర్నర్ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదన్నారు బండి సంజయ్‌.. రాష్ట్ర ప్రభుత్వం ఏది చేస్తే దానికి రబ్బరు స్టాంప్ లా వ్యవహరించాలా? అంటూ ప్రశ్నించిన ఆయన.. టీఆర్ఎస్‌ ఆందోళనలో రైతులు ఎక్కడా రావడం లేదన్నారు.. దాన్యం కొనాల్సింది సీఎం కేసీఆరేనని డిమాండ్‌ చేశారు. మరోవైపు.. బీజేవైఎం ఆధ్వర్యంలో డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేయనున్నట్టు వెల్లడించారు.. సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పే వరకు వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. మా పార్టీలో ఎవరు ఉన్న కూడా పార్టీపరంగా చర్యలు తీసుకుంటాను.. ఫస్ట్ టెస్ట్‌లు చేయాలని సవాల్‌ చేశారు.. డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు ఎంత మందిపై చర్యలు తీసుకున్నావు కేసీఆర్? అని నిలదీశారు.. ఈడీకి డ్రగ్స్ రిపోర్టు ఎందుకు ఇవ్వడం లేదు.. నీ కుటుంబానికో.. నీ పార్టీ నేతలకు సంబంధం ఉంది.. కాబట్టే ఇవ్వడం లేదు అని ఆరోపించారు. అంతర్జాతీయ సంబంధాలు పెంచుకునేందుకు డ్రగ్స్ దందాకి ప్రోత్సహిస్తున్నారేమో అంటూ సెటైర్లు వేశారు. అర్థరాత్రి పబ్‌లకు అనుమతి ఇచ్చింది ఎవరు.. అంతా నీ కుటుంబ సభ్యులవే కదా? మొన్న ఎంత మందికి టెస్ట్ చేశారు.. ఎందరు డ్రగ్స్ తీసుకున్నారు.. ఆ కేసుకు ప్రాధాన్యత లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యుల పై విమర్శలు సరికాదు… ఏ పార్టీ అయినా సరే… డ్రగ్స్ దందాకు హైదరాబాద్ అడ్డాగా మారింది.. ఇక,చ రాష్ట్ర ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు.

Exit mobile version