Fourth Phase of Praja Sangrama Yatra: బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటి నుంచి 10 రోజుల పాటు సాగనుంది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగరి, మేడ్చల్, ఉప్పల్ ఎల్బీనగర్‌తోపాటు.. ఇబ్రహీం పట్నం నియోజక వర్గంలో బండి సంజయ్ పాదయాత్ర సాగనుంది. ప్రజా సంగ్రామ యాత్రంలో భాగంగా.. మొత్తం 115.3 కిలోమీటర్ల మేర బండి సంజయ్ నడవనున్నారు. యాత్రలో దారిపొడవునా ప్రజా సమస్యలు తెలుసుకోనున్నారు. బండి సంజయ్ ఇప్పటి వరకు మూడు విడుతల్లో 11 వందల 28 కి.మీ. మే పాదయాత్ర చేశారు. అయితే.. మొత్తం 18 జిల్లాలు, 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేశారు బండిసంజయ్.
read also:Amaravati Farmers Yatra: నేటి నుంచి మహా పాదయాత్ర-2 షురూ
నాలుగో విడుత యాత్రతో కలిపి మొత్తం 8 పార్లమెంట్ నియోజకవర్గాలతో 48 అసెంబ్లీ సెగ్మెంట్లలో పూర్తీ కానుంది. బండి పాదయాత్రలో భాగంగా ప్రతిరోజు సగటున 11 కి.మీ. మేర యాత్రను సాగించనున్నారు. అయితే గతంలో రోజుకు సుమారు 15 కి.మీ. పైగా నడిచారు. ఇప్పుడు గ్రేటర్ పరిధిలో బండిసంజయ్ ఈయాత్ర చేపడతున్నారు. ఈ మహానగరంలో సమస్యలు అధికంగా ఉండటంతో అన్ని వర్గాల ప్రజలను కలిసి, వారి సమస్యలను తెలుసుకుంటూ బండి సంజయ్ 10 నుంచి 11 కి.మీ. కుదించుకున్నారు. ఈనెల 17న కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విమోచన వేడుకలకు హాజరుకానున్న నేపథ్యంలో, ఆఒక్కరోజు యాత్ర వాయిదా వేసుకుంటున్నారు. ఆగస్టు (ఈనెల) 22న పెద్ద అంబర్పేట ఔటర్ రింగు రోడ్డు వద్ద.. పాదయాత్రను బండి సంజయ్ ముగించనున్నారు. బండిసంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇక బహిరంగ సభకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Amaravati Farmers Yatra: నేటి నుంచి మహా పాదయాత్ర-2 షురూ