Fourth Phase of Praja Sangrama Yatra: బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర.. నేటి షెడ్యూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fourth Phase of Praja Sangrama Yatra: బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటి నుంచి 10 రోజుల పాటు సాగనుంది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగరి, మేడ్చల్, ఉప్పల్ ఎల్బీనగర్, ఇబ్రహీం పట్నం నియోజక వర్గంలో బండి సంజయ్ పాదయాత్ర సాగనుంది. నేడు (13) చంద్రగిరి నగర్, శ్రీనివాస్ నగర్ లాస్ట్ బస్ స్టాప్, జగద్గిరి గుట్ట, రంగారెడ్డి నగర్, ఆస్టెస్టార్స్ కాలనీ, చిత్తారమ్మ దేవాలయం కూకట్ పల్లి, వెంకట్రావు నగర్, కూకట్ పల్లి గ్రామం, కేపీహెచ్‌బీ కాలనీ వరకు బండి సంజయ్ పాదయాత్ర సాగనుంది. ప్రజా సంగ్రామ యాత్రంలో భాగంగా.. మొత్తం 115.3 కిలోమీటర్ల మేర బండి సంజయ్ నడవనున్నారు. యాత్రలో దారిపొడవునా ప్రజా సమస్యలు తెలుసుకోనున్నారు. బండి సంజయ్ ఇప్పటి వరకు మూడు విడుతల్లో 11 వందల 28 కి.మీ. మే పాదయాత్ర చేశారు. అయితే.. మొత్తం 18 జిల్లాలు, 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేశారు బండిసంజయ్.
Also Read
నాలుగో విడుత యాత్రతో కలిపి మొత్తం 8 పార్లమెంట్ నియోజకవర్గాలతో 48 అసెంబ్లీ సెగ్మెంట్లలో పూర్తీ కానుంది. బండి పాదయాత్రలో భాగంగా ప్రతిరోజు సగటున 11 కి.మీ. మేర యాత్రను సాగించనున్నారు. గతంలో రోజుకు సుమారు 15 కి.మీ. పైగా నడిచారు. ఇప్పుడు గ్రేటర్ పరిధిలో బండిసంజయ్ ఈయాత్ర చేపడతున్నారు. ఈ మహానగరంలో సమస్యలు అధికంగా ఉండటంతో అన్ని వర్గాల ప్రజలను కలిసి, వారి సమస్యలను తెలుసుకుంటూ బండి సంజయ్ 10 నుంచి 11 కి.మీ. కుదించుకున్నారు. ఈనెల 17న కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విమోచన వేడుకలకు హాజరుకానున్న నేపథ్యంలో, ఆఒక్కరోజు యాత్ర వాయిదా వేసుకుంటున్నారు. ఆగస్టు (ఈనెల) 22న పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగు రోడ్డు వద్ద.. పాదయాత్రను బండి సంజయ్ ముగించనున్నారు. బండిసంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇక బహిరంగ సభకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Train Drove With Noodles Soup: జపాన్‌లో కొత్త ప్రయోగం.. నూడుల్స్ సూప్‌తో రైలు ప్రయాణం
తాజావార్తలు
-
Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్‌పై అమెరికా ఆఫర్ ఇదేనా?
-
Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
-
Kiss Car: బాయ్ ఫ్రెండ్ కారుకు 3,400 ముద్దులు.. షాకిచ్చిన పోలీసులు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్‌పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Rafale vs J-16: రఫేల్‌తో చైనీస్ J-16 పోరాటం.. నిశితంగా గమనిస్తున్న భారత్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!