Bandi Sanjay Fires On Cess Election Result: సెస్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సెస్ ఎన్నికల ఫలితాల విషయంలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలు చేశారు. ఐదు స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచినప్పటికీ.. ఫలితాలను తారుమారు చేశారని వ్యాఖ్యానించారు. సెస్‌ను నాశనం చేసిన బీఆర్ఎస్‌కు ఓట్లు వేయలేదనే అక్కసుతో.. ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తారా? అని ఆగ్రహించారు. బీఆర్ఎస్ వాళ్లే ఓట్లేసుకొని, వాళ్లే ఫలితాలను ప్రకటించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇంతదానికి ఎన్నికలెందుకు? ఫలితాలు ప్రకటించడమెందుకు? ప్రజల సమయాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమెందుకు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అధికారం బీఆర్ఎస్ చేతుల్లో ఉంది కదా ఇష్టానుసారం వ్యవహరిస్తారా? అని నిలదీశారు. బీఆర్ఎస్ నేతల తీరును చూసి జనం అసహ్యించుకుంటున్నా.. సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని చెప్పారు. సాధారణ ఎన్నికల్లో మీ ఆటలు చెల్లవని, ప్రజలు కేసీఆర్ చెంప చెళ్లుమనిపించేందుకు ఎప్పుడో సిద్ధమయ్యారని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Tammineni Veerabhadram: బీఆర్ఎస్‌తో పొత్తుల అంశం చర్చించలేదు.. అవన్నీ ఊహాగానాలే
అంతకుముందు.. ప్రజా సంగ్రామ యాత్ర తర్వాత సీఎం కుటుంబంలో వణుకు మొదలైందన్నారు బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ నేతలు చాలా అహంకారంగా, అసభ్యంగా మాట్లాడుతున్నారని.. తెలంగాణ రాష్ట్రంలాగా దేశం అభివృద్ధి చెందాలని మాయమాటలు చెబుతున్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. తన కుటుంబంపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఎక్కడా ఇవ్వట్లేదని.. దాన్ని నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. కేసీఆర్ రైతు ద్రోహి అంటూ నిప్పులు చెరిగిన బండి సంజయ్.. యూరియా సబ్సిడీ ఇస్తోందని కేంద్రమేనని తెలిపారు. తాము అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే.. వాళ్లు మాత్రం మోడీని, బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. టీఆర్‌ఎస్ దివాలా దీసి బీఆర్‌ఎస్ వచ్చిందని సెటైర్లు వేసిన ఆయన.. రైతులకు ఇచ్చిన హామీ ఏమైంది? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.
పెళ్ళైన హీరోలతో నగ్మా ఎఫైర్లు.. లిస్ట్ పెద్దదే