NTV Telugu Site icon

Bandi Sanjay: 6 నెలల్లో ఎప్పుడైన ఎన్నికలు రావొచ్చు

Ktr Bandi Sanjay

Ktr Bandi Sanjay

Elections can come anytime in 6 months: 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను జైళ్లకు పంపించే కుట్ర కేసీఆర్‌ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల లిస్ట్ నుండి బీజేపీ వాళ్ళ ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతుంని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు లిస్ట్ ను చెక్ చేసుకోండని, ఓట్లను నమోదు చేసుకోవాలని, మన వల్ల ఓట్లను నమోదు చేయించండని అన్నారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అంటే పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతోనే సాధ్యమన్నారు. బూత్ కమిటీ సభ్యుడు బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడు కావొచ్చు జాతీయ అధ్యక్షుడు కావొచ్చు కేసీఆర్‌ కుటుంబ సభ్యులు కేంద్ర నిధులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండపిడ్డారు బండి సంజయ్‌.

Read also: Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌

కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో అమలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. 22 నోటిఫికేషన్ లు 20 వేల ఉద్యోగాలకు మాత్రమే ఇచ్చిందని, ఎంతమందికి నియామక పత్రాలు ఇచ్చిందో ఈ ప్రభుత్వం చెప్పడం లేదని బండి సంజయ్‌ అన్నారు. కేంద్ర నిధులపై కేటీఆర్ మీ అయ్యతో చర్చకు సిద్దం.. రాజీనామ పత్రం పట్టుకొని మీ అయ్యను రమ్మను అంటూ సవాల్‌ విసిరారు. గతంలో సవాల్ చేసి తోక ముడుచుకొని పారిపోయింది మీరంటూ గుర్తు చేశారు. అభివృద్ధి గురించి మాట్లాడండి .. రాజకీయాలు తర్వాత అంటూ చురకలంటించారు. రుణ మాఫీ చేయక పోవడం వల్ల రైతు బందు నిధులను బ్యాంక్ లు తమ ఖాతాలో వేసుకున్నాయని ఆరోపించారు. నాలుగైదు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు.

Read also: CBI Investigations: హైదరాబాద్ లో సీబీఐ సోదాలు.. పాతబస్తీలో ఆరు చోట్ల అధికారులు తనిఖీలు

మద్యం వల్ల వచ్చే ఆదాయం అంతకు పది వేలు ఎక్కువ వస్తుందని అన్నారు. మిగతా ఆదాయం అంతా ఎటు పోయింది? అని ప్రశ్నించారు. ప్రజలు కట్టిన పన్ను ఎటు పోయిందో జాడ లేదన్నారు. బీజేపీకి అధికారం ప్రజల కోసమన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ పొత్తు ఉంటుందని మరో సారి బయట పడ్డదని అన్నారు. ఇప్పుడు పోయి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై ఫిర్యాదు చేస్తున్నారని ఎద్దేవ చేశారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు నకల్ కొట్ట డానికి అఖల్ ఉండాలని కాంగ్రెస్‌ ను విమర్శించారు. హిందూ దేవి దేవతలను కించ పరుస్తూ ఉంటే భారిద్దామా? అంటూ ప్రశ్నించారు. హిందూ దేవతలను అవమానిస్తే.. కొడుకులను ఉరికిచ్చి కొట్టే పరిస్థితి వస్తుందని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రహించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Sankranti Holidays: తెలంగాణ స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు.. ఎప్పటినుంచంటే?