NTV Telugu Site icon

ప్రజల దెబ్బకు టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కావాలి : బండి సంజయ్

MP Bandi Sanjay

హుజురాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలే అంటూ ఆరోపించారు. 2 నెలల ముందు ఇదే ప్లీనరీ పెడితే కేసీఆర్ ఆడే అబద్దాలకు ఆస్కార్ వాళ్లు అవార్డు ఇచ్చే వాళ్లు అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు హుజూరాబాద్ లో ముఖం చెల్లక ఈసీపై నిందలు వేస్తున్నరాని, భారత ఎన్నికల సంఘానికి ప్రపంచంలోనే మంచి పేరుందని, సీఎంగా ఉంటూ ఈసీపై నిందలేయడం సిగ్గుచేటని అన్నారు.

బెంగాల్ ఎలక్షన్ లో ఈసీ రూల్ తో ప్రధానమంత్రి మీటింగ్ లు క్యాన్సిల్ అయ్యాయని, ఆ రూల్స్ వల్ల అమిత్ షా మీటింగ్ కూడా రద్దు చేసుకున్నామని ఆయన తెలిపారు. తెలంగాణలో కోవిడ్ ఉంది. ఎన్నికలు వాయిదా వేయాలంటూ ఈసీకి లేఖలు రాసింది కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. దళిత బంధు పేరిట కేసీఆర్ మోసం చేస్తున్నాడు. దళిత సీఎం ఏమైంది? ఉప ముఖ్యమంత్రి ఏమైంది? మూడెకరాల భూమి ఏమైంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దళిత బంధుపై హుజూరాబాద్ నుండే బీజేపీ యుద్దం ప్రారంభించబోతున్నామని, కేసీఆర్ చేసిన అన్ని సర్వేల్లో బీజేపీ గెలుస్తుందని ఖాయమై పోయిందన్నారు.

‘ఓటుకు రూ.20 వేల పంచేందుకు కంటై నర్లలో డబ్బుల కట్టలు తీసుకొచ్చిండ్రట. టీఆర్ఎస్ నేతలే ఓటుకు 15 వేలు కట్ చేసుకుని రూ.5 వేలే ఇస్తున్నరట. అవి కూడా దొంగ నోట్లు ఇస్తరేమో జాగ్రత్త. టీఆర్ఎస్ కు ఓటేయాలంటూ పోలీసులతో బెదిరించి భయపెడుతున్నరు. ప్రజలెవరూ భయపడకండి. స్వేచ్ఛగా ఓటేయండి. పువ్వు గుర్తుకు ఓటేసి కేసీఆర్ కు గుణపాఠం చెప్పండి. వచ్చేనెల 2న హుజూరాబాద్ ప్రజల దెబ్బకు టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కావాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ కు ‘ట్రిపుల్ ఆర్’ సినిమా చూపిస్తాం. వచ్చేనెల 2 తరువాత కేసీఆర్ దుకాణం బంద్ కావడం ఖాయమని బండి సంజయ్‌ అన్నారు.