Bandi Sanjay criticizes CM KCR: సీఎం కేసీఆర్ కు మూడింది.. వచ్చేదీ బీజేపీ సర్కారే అని అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఐదో విడత ప్రజసంగ్రామ యాత్రలో భాగంగా బైంసాలో జరిగిన బహిరంగ సభలో బండి సంజయ్ టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి రాగానే బైంసా పేరును ‘మహిషా’గా మారుస్తామని అన్నారు. బైంసాను దత్తత తీసుకుంటామని.. బైంసా అల్లర్ల బాధితులపై కేసులు ఎత్తేస్తాం అని వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజలను కష్టాలు పెడుతున్న కేసీఆర్ ఏం సాధించారని ప్రశ్నించారు.
బీజేపీ అధికారంలోకి రాగానే.. అర్హులైన అందరికీ ఉచితంగా విద్యా-వైద్యం అందించడంతో పాటు ఇళ్లు లేని వారికి ఇళ్లు కట్టిస్తామని బండి సంజయ్ అన్నారు. బైంసాలో వచ్చిన ప్రజలను చూస్తే మాలో జోష్ పెరుగుతుందని ఆయన అన్నారు. బైంసాలో మతకల్లోల్లాల్లో గాయపడిన, కేసులు పాలైన బాధితులను అభినందిస్తున్నా అని.. బైంసా బాధితుల పక్షాన హిందూవాహిని పోరాటంపై ప్రశంసలు కురిపించారు. బైంసా రావాలంటే వీసా తీసుకోవాలా..? బైంసా ఏమైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో ఉందా..? అని ప్రశ్నించారు. ఇక్కడికి రావాలంటే వీసా తీసుకుని రావాలా.. మతవిద్వేషాలను రెచ్చగొట్టే ఎంఐఎం నాయకులు మాత్రం ఎక్కడైనా తిరుగొచ్చా..? అని ప్రశ్నించారు. హిందూ దేవతలను కించపరిచే మునావర్ ఫరూఖీ వంటి వారు ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చా..? అని అడిగారు.
Read Also: Etela Rajender: సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లో పోలీసులు.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే..
ఇకపై తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగిన కాషాయ జెండా రెపరెపలాడించాలని.. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బైంసాను దత్తత తీసుకుంటామని అన్నారు. బైంసా ప్రజలు భయపడాల్సిన పనిలేదని.. హిందూ సమాజం మీ వెంట ఉంటుందని ఆయన అన్నారు. బైంసా అంటే కేసీఆర్ కు భయమని అన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశాడని.. రూ. 5 లక్షల కోట్లు అప్పుచేసి, ఒక్కో వ్యక్తిపై రూ. 1.5 లక్షల అప్పు మోపిండని అన్నారు. కేసీఆర్ సర్కార్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని.. నరేంద్రమోదీ ప్రభుత్వ పోయిన నెలలో ఒకేసారి 75 వేల మందికి, ఈ నెల 70 వేల మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు.
సమస్యల పరిష్కారం కోసం ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ధర్నా చేస్తే పట్టించుకోలేదని.. ఇచ్చిన హామీలు గాలికొదిలేశాడని కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కడెం ప్రాజెక్టు గేట్ల మెయింటనెన్స్ కు నిధులు ఇవ్వలేనోడు రాష్ట్రాన్ని ఏం కాపాడుతాడని అన్నారు. అన్ని పార్టీకు అధికారం ఇచ్చారు..ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను బండి సంజయ్ కోరారు. బైంసా గడ్డపై 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభించడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. కేసీఆర్ ఇంకో ఏడాది హిందువులపై దాడులు చేయిస్తాడు.. కష్టాను భరిద్ధాం.. రాబోయేది మన ప్రభుత్వమే అని అన్నారు.
