NTV Telugu Site icon

Bandi Sanjay : కుట్రలకే పెద్ద కుట్రదారుడు కేసీఆర్

Bandi Sanjay

Bandi Sanjay

Telangana BJP President Bandi Sanjay Counter To Chief Minister K.Chandrashekar Rao.
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. అయితే వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్‌ భారీ వర్షాలకు విదేశీ కుట్ర అని, క్లౌడ్‌ బస్టర్‌ తో భారీ వర్షాలు కురిసేలా చేశారంటూ ఆరోపించారు. అయితే సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందిస్తూ.. భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదం. బహుశా సీఎంకు మతి భ్రమించినట్లుంది. ఆయనను ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేసీఆర్ వరద ముంపు ప్రాంతాల పర్యటనను చూసి జనం నవ్వుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వరద ప్రాంతాల్లో పర్యటిస్తే బాధితులకు భరోసా కలగాలి. ఆదుకుంటారనే నమ్మకం ఏర్పడాలి. కానీ ఈ సీఎం అక్కడికి వెళ్లి చేసిన కామెంట్స్ జోకర్ ను తలపిస్తున్నాయి. గోదావరికి వరదలు గతంలో ఎన్నోసార్లు వచ్చినయ్… ఈసారి కూడా వచ్చినయ్.. భవిష్యత్తులో రావని కూడా చెప్పలేం… కానీ కేసీఆర్ కు మాత్రం భారీ వర్షాలు మానవ స్రుష్టిలా కన్పిస్తోంది.

 

Etela Rajender : ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము గెలుపు ఖాయం

పైగా విదేశాల కుట్రనట. కుట్రలకే అతిపెద్ద కుట్రదారుడు కేసీఆర్… తానే పెద్ద ఇంజనీరింగ్ నిపుణుడినని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ రీడిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌజ్ వర్షాలకు మునిగిపోయింది. మిషన్ కాకతీయ పేరుతో పూడిక తీయడమే తప్ప కరకట్టల నిర్మాణాన్ని విస్మరించడంతో అనేకచోట్ల చెరువులు, కుంటలు తెగి వేల ఎకరాల పంట నష్టానికి దారి తీసింది. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు కేసీఆర్ పడరాని పాట్లు పడుతున్నారు. విదేశీ కుట్ర పేరుతో మరో డ్రామాకు తెరదీశారు. వారం రోజులుగా వరద ముంపుతో ప్రజలు అల్లాడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జీతాలందక ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నరు. జీతాలివ్వడం చేతగాక వర్షాల అంశాన్ని విదేశీ కుట్ర పేరుతో అంతర్జాతీయం చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు కన్పిస్తోంది. కేసీఆర్… పోరంబోకు మాటలాపి భారీ వర్షాలకు ఇండ్లు కోల్పోయి పూర్తిగా నిరాశ్రయులైన వేలాది మంది ముంపు బాధితులను ఏ విధంగా ఆదుకుంటావో చెప్పాలి. ముంపు బాధితుల కుటుంబాలకు రూ.10 వేలు ఇస్తాననడం ఏ మాత్రం సమర్ధనీయం కాదు. సర్వం కోల్పోయిన బాధితులకు ఆ డబ్బు ఏ మూలకు సరిపోతుంది? పైగా గతంలో హైదరాబాద్ వరద ముంపు బాధితులకు రూ.10 వేల సాయం చేస్తానని హామీ ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్ సొంతం.

 

Governor Tamilisai : మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి వచ్చా

చేసిన అరకొర సాయం టీఆర్ఎస్ కార్యకర్తల జేబుల్లోకి వెళ్లిన విషయం ప్రజలింకా మరువలేదు. వాస్తవానికి సీఎం పర్యటనలో భాగంగా వరద ముంపు ప్రాంతాల్లో జరిగిన నష్టం, బాధితుల సంఖ్యపై అంచనా వేసి.. ఆర్ధిక సాయం ప్రకటిస్తారని ఆశించాం. కానీ అవేమీ లేకుండా కేసీఆర్ పర్యటన గాలి పర్యటనలా మారింది. పైగా కరకట్టల గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలివ్వడం, 10 వేల ఇండ్లతో కాలనీని నిర్మిస్తాననడం హాస్యాస్పదంగా ఉంది. కేసీఆర్ సీఎం కుర్చీలో కూర్చుని 8 ఏళ్లయింది. తనకు తాను ఇరిగేషన్ నిపుణుడిగా చెప్పుకుంటున్న కేసీఆర్ కు ఇన్ని రోజులుగా కరకట్టల ధ్యాస ఎందుకు రాలేదు?. పైగా 10 వేల ఇండ్లతో కాలనీ నిర్మిస్తానని చెప్పడం శతాబ్దపు ఇంకో జోక్. ఇప్పటికే ‘‘అర్హులైన దళితులందరికీ దళిత బంధు ఇస్తా… ఇంటింటికో ఉద్యోగం ఇస్తా… దళితుడిని సీఎంను చేస్తానన్న హామీలాలంటిదే ఇది కూడా’’.

పాఠశాలల్లో పిల్లలు చదువుకుందామంటే పుస్తకాల్లేవు. చాక్ పీసులకు పైసల్లేవు. ఉద్యోగులకు జీతాల్లేవు… కానీ 10 వేల ఇండ్లతో కాలనీ నిర్మిస్తాననడం చూస్తే నవ్వొస్తోంది. ఇకనైనా అబద్దాలు మానుకుని నిర్మాణాత్మకంగా ఏం చేస్తారో చెప్పాలి. గత వారం రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి వందలాది గ్రామాలు మంపుకు గురై వేలాది మంది నిరాశ్రయలవుతుంటే ఏమాత్రం పట్టించుకోని కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లోనున్న ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడుతూ కేంద్రాన్ని బదనాం చేసేందుకు కుట్ర చేస్తుండటం సిగ్గు చేటు. కేంద్రాన్ని బదనాం చేసేందుకు వెచ్చిస్తున్న సమయాన్ని బాధితులను ఆదుకునేందుకు, సహాయక చర్యలపై వెచ్చిస్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలి.