Site icon NTV Telugu

Bandi Sanjay: రౌడీయిజం చేస్తారా? మా కార్యకర్తలు బరిలోకి దిగితే తట్టుకోలేరు

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేయడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే దమ్ములేక భౌతిక దాడులకు దిగి రౌడీయిజం చేస్తారా? అంటూ ప్రశ్నించారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మలు దాడులతో ప్రశ్నించే గొంతును నొక్కాలనుకుంటున్నరు అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. గడీల గూండాల దాడులకు… తోక ఊపులకు భయపడతామనుకుంటున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సహనాన్ని చేతగానితనం అనుకోవద్దు… మా కార్యకర్తలు బరిలోకి దిగితే తట్టుకోలేరంటూ వార్నింగ్‌ ఇచ్చారు. ప్రజలే టీఆర్ఎస్ గూండాలకు కర్రుకాల్చి వాతపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బండి సంజయ్ నిప్పులు చెరిగారు.

Read also: KTR: తెలంగాణ యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా

అయితే ఇవాళ ఎంపీ అరవింద్‌ ఇంటి ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఎంపీ ఇంటిలో చొరబడ్డారు. ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు ఎంపీ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఎంపీ ఇంటి ముందు జిస్టి బొమ్మను దగబెట్టి నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఇంటి గేటును మూసి వేసిన గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు. వారిని పోలీసులు పట్టికుని కిందికి దించారు. ఎమ్మెల్సీ కవితపై అనుచుత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు. దీంతో ఎంపీ ఇంటి వద్ద తీవ్ర స్థాయిలో ఆందోళన నెలకొంది. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

Read also: IND Vs NZ: భారత్-న్యూజిలాండ్ తొలి టీ20కి వరుణుడు అడ్డంకి

తాజాగా.. ఎమ్మెల్సీ కవితతో బీజేపీ సంప్రదింపులు జరిపిందన్నకేసీఆర్‌ వ్యాఖ్యలను ఆయన ఖండించిన విషయం తెలిసిందే. అయితే.. లిక్కర్ స్కాంలో చిక్కుకున్న కవితతో సంప్రదింపులు జరపాల్సిన కర్మ బీజేపీకి పట్టలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో కవిత సంప్రదింపులు జరిపిందన్నారు. ఇక, టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చే సమయంలో కవితను పిలవలేదన్నారు. దీంతో.. కేసీఆర్‌ను బెదిరించటానికే కవిత కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపినట్లు ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్‌కు 20సీట్లకు మించి రావన్నారు. ఇక పార్టీలో పాత నేతలను తాను కలుపుకుపోవటం లేదనేది ప్రచారం మాత్రమేనన్నారు. ఇక..నియోజకవర్గ ఇంచార్జ్‌ల విషయంలో కొత్త, పాత నేతలను బాలెన్స్ చేశామన్నారు.
VijayaSai Reddy: చంద్రబాబుకు కాలం చెల్లింది.. రాష్ట్రం నవ్యాంధ్ర కాబోతోంది..!!

Exit mobile version