Site icon NTV Telugu

Bandi Sanjay: జోగులాంబ అమ్మవారిని కించపరిచావ్.. కరీంనగర్ గతే పడుతుంది

Bandi Sanjay

Bandi Sanjay

రోజులు దగ్గర పడ్డప్పుడు మాటలు ఇలాగే వస్తాయని.. జోగులాంబ అమ్మవారిని కంచపరిచే స్థాయికి చేరావ్ అని సీఎం కేసీఆర్ పై  ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జోగులాంబ అమ్మవారిని తిట్టే స్థాయికి, వ్యంగంగా మాట్లాడే స్థాయికి వచ్చావంటే ఈ  రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు.. ఫామ్ హౌజ్ లో పడుకోవాలని సలహా ఇచ్చారు. హిందు సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు, లేకపోతే కరీంనగర్ లో పట్టిన గతే పడుతుందని అన్నారు. దేశ ప్రధానిని గౌరవించే సంస్కారం లేని సంస్కార హీనుడివని విమర్శించారు.

తెలంగాణలో మైనర్ బాలికలపై అత్యాచారం జరుగుతుంటే పట్టుకోలేని చేతకాని దద్దమ్మవని తీవ్ర పదజాలంతో విమర్శించారు. యూపీలో క్రిమినల్స్ జైలు నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ నేతలు కలిసి అత్యాచారాలు, హత్యలు, కబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. వర్షాల నేపథ్యంలో ఇస్తాంబుల్, లండన్,  సింగపూర్ ఏవని ప్రజలు ప్రశ్నిస్తారని తెలిసే ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టాడని ఎద్దేవా చేశాడు. కర్ణాటక ముఖ్యమంత్రి ఎక్కడ వరదలు వస్తే అక్కడికి వెళ్తున్నారని.. కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటకు రావడం లేదని అన్నారు. కేసీఆర్ దేశం అంతా తిరిగి బ్రాందీలు, బ్రాండ్ల గురించి మాట్లాడుతున్నాడని విమర్శించారు.

Read Also: Pawan Kalyan: సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టడమేంటి?

ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్నా, అత్యాచారాలకు గురైనా, ఉద్యోగులు, రైతుల ఆత్మహత్యలు చేసుకున్నా బయటకు రావడం లేదని విమర్శించారు. మోదీకి కేసీఆర్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. రోజుకు 18 గంటలు పనిచేస్తే… నువ్వు ఫామ్ హౌజుల నుంచి బయటకు రావని కేసీఆర్ ని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబానికి అహంకారం పెరిగిందని.. అధికారాన్ని విసిరి పడేస్తానని అంటున్నాడని, ఎంత అహంకారం అని ప్రశ్నించారు. అధికారం తలకెక్కిందని.. నిన్ను , నీ కుటుంబాన్ని తీసుకెళ్లి ప్రజలు బయటపడేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

 

Exit mobile version