Bandi Sanjay: ఈనెల 22న అయోధ్యలో జరగబోయే రామ మందిర పున:ప్రతిష్ట కార్యక్రమం కోసం యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తున్న తరుణంలో ఆరోజు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. పవిత్రమైన దైవ కార్యాన్ని ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా చూడాలని కోరారు. ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంటకు విచ్చేసిన బండి సంజయ్ కుమార్ ప్రసిద్దిగాంచిన సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ పండితులు బండి సంజయ్ కు ఆశీస్సులు అందించారు.
అనంతరం బండి సంజయ్ చీపురు, పార బట్టి సీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ….ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పిలుపు మేరకు దేవాలయాల శుద్ది చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయ పరిసరాలను శుద్ది చేయడం సంతోషంగా వుందన్నారు. అయోధ్యలో ఈనెల 22న జరగబోయే అందాల రాముడు, అయోధ్య రాముడు, ఆదర్శ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తోందన్నారు.
Read also: V. Hanumantha Rao: తొందరపడి మాట్లాడితే నష్టపోయేది మీరే.. కేటీఆర్ పై వీహెచ్ ఫైర్..
తెలంగాణ ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు సిద్ధమైన నేపథ్యంలో 22వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు దేవుడి అక్షింతల కార్యక్రమంలో స్వచ్చందంగ పాల్గొంటున్నారని చెప్పారు. రామ మందిర నిర్మాణ నిధి సేకరణ లో తెలంగాణ అగ్రభాగాన వుందన్నారు. అయోధ్య అక్షింతలను రేషన్ బియ్యం అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను మీడియా ప్రస్తావించగా.. అక్షింతల్లో రేషన్ బియ్యం, బాసుమతి బియ్యం, జై శ్రీరాం బియ్యం అనే రకాలు వుండవు. పవిత్రమైన దేవుడి అక్షింతలను రేషన్ బియ్యం అంటూ కాంగ్రెస్ నేతలు వక్రీకరించడం తగదన్నారు. కాంగ్రెస్ నేతలు కోరితే బాసుమతి బియ్యాన్ని పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
అనంతరం రాష్ట్రమంతా జై శ్రీరాం అనే నినాదాలతో మారుమోగుతోందన్నారు. అందులో భాగంగా కరీంనగర్ లో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల ముందు స్వచ్ఛందంగా ‘‘జై శ్రీరాం’’అనే వాల్ రైటింగ్ రాయించుకుంటున్నారని తెలిపారు. ఈనేపథ్యంలో బండి సంజయ్ కుమార్ ఈరోజు ఉదయం తన నివాసం ఆవరణలో స్వయంగా ‘‘జై శ్రీరాం’’అని వాల్ రైటింగ్ చేయడం గమనార్హం. మరోవైపు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున కాషాయ సైనికులకు ఫోన్లు చేసి తమ ఇంటికి జై శ్రీరాం వాల్ రైటింగ్ రాయాలంటూ ఫోన్లు చేస్తుండటం విశేషమన్నారు.
Holiday: జనవరి 22న పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు హాఫ్ డే సెలవు..