Site icon NTV Telugu

Bandi Sanjay : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరికపై బండి సంజయ్‌ ఏమన్నారంటే..?

Bandi Sanjay Komatireddy Rajgopal Reddy

Bandi Sanjay Komatireddy Rajgopal Reddy

Telangana BJP Cheif Bandi Sanjay About MLA Komatireddy Raj Gopal Reddy.
గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌ క్రియాశీలక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తాజాగా బీజేపీలో చేరనున్నట్లు వెల్లడైంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ చేరికపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందిస్తూ.. కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా.. డేట్ త్వరలో నే పిక్స్ అవుతుందని, ఉప ఎన్నిక అనేది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుందన్నారు. చాలా మంది బీజేపీలో చేరుతారని, రాజ్ గోపాల్ రెడ్డి రాకతో పార్టీ మరింత పెరుగుతుందన్నారు.

Revanth Reddy : గుజరాత్‌కు వేల కోట్లు ఇచ్చిన కేంద్రం తెలంగాణను ఎందుకు పట్టించుకోదు

బీజేపీ పార్టీ నేతల ఇళ్లకు వెళ్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గా సీనియర్ లను కలవడం నా బాధ్యత అని ఆయన అన్నారు. అందరం కలిసే ఉన్నామని, వారు అనుభవం ఉన్న నేతలు వారి సలహాలు సూచనలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఇందులో అపార్థాలు, ఆలోచన చేయాల్సింది ఏమి లేదని, కలవక పోతే కలవలేదంటారు కలిస్తే కలిశారు అంటారు… సీఎం కుటుంబం అక్రమంగా అడ్డగోలుగా సంపాదించింది… నక్సలైట్ లు డంపు ల లాగా సీఎం కుటుంబం ఎక్కడ పడితే అక్కడ పెట్టారు, దాచారు… ఆ కుటుంబానికి ఏది చూసినా ఈడి నే కనిపిస్తుంది… గుంట నక్కల పైసలు స్వాధీనం చేసుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు…. తప్పకుండా ఈడీ విచారణ జరుపుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

 

Exit mobile version