Bandi Sanjay : కుమ్కక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హేట్ స్పీచ్ కేసులో అక్బరుద్దీన్ ఓవైసీని నిర్ధోషిగా ప్రకటిస్తూ నాంపల్లి కోర్టు ఈ రోజు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ కేసును కావాలనే నీరుగార్చారని ఆరోపించారు. టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ కుమ్కక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి..? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఈ మూడు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని, నిర్మల్ కేసుపై తక్షణమే అప్పీల్ కు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై నమోదైన కేసును న్యాయ స్థానం కొట్టివేయడం విస్మయం కలిగిస్తోందని, ‘’15 నిమిషాలు సమయమిస్తే హిందువులందరినీ నరికి చంపుతామంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ప్రపంచమంతా చూసింది. విన్నది. అయినా అక్బరుద్దీన్ ను నిర్దోషిగా ప్రకటించడం ఆశ్చర్యం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ విషయంలో మేం కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపట్టడం లేదు. కోర్టుకు దురుద్దేశాలు ఆపాదించడం లేదు. ఎందుకంటే న్యాయ స్థానానికి కావాల్సింది ఆధారాలు, సాక్ష్యాలు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఆధారాలను సమర్పించలేదని ఆయన అన్నారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్కక్కయ్యరనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి..? అని ఆయన మండిపడ్డారు. అధికారంలో ఉన్న పార్టీలతో అంటకాగడం ఎంఐఎం పార్టీకి అలవాటే. 2009లో అక్బరుద్దీన్ పై కేసు నమోదైతే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంఐఎంతో కుమ్కక్కై కేసును నీరుగార్చిందన్నారు.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
హిందూ దేవతలను అవమానపరుస్తూ అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై 2012లో నిజామాబాద్ లో నమోదైన కేసును బెన్ ఫిట్ ఆఫ్ డౌట్ కింద కొట్టివేసిందని, ప్రభుత్వానికి ఈ విషయంలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అప్పీల్ కు వెళ్లాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్-టీఆర్ఎస్-ఎంఐఎం కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో ఆ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని ఆయన అన్నారు.
Errabelli Dayakar Rao : కేవలం రైతులను ఆదుకోవాలన్న సంకల్పంతోనే
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!