తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులతో ఆటలాడుతోందని మండిపడ్డారు ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థల పరీక్షలు ఉన్నప్పుడే వస్తున్నాయన్నారు. కావాలని ఒకే రోజు పోటీపరీక్షలు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆగస్ట్ 7 వతేదీన యూపీఎస్సీ సంస్థ పరీక్షతో పాటు రాష్ట్ర tslprd ఎగ్జామ్ వుందన్నారు. రెండింటిలో ఏదో ఒక జాబ్ వస్తుందని నిరుద్యోగులు ఆశపడ్డారు. కానీ ఈ రెండు పరీక్షలు పోలీస్ శాఖకు సంబంధించినవే అన్నారు.
Cyber Fraud: ఢిల్లీ హైకోర్టు జడ్జి వాట్సాప్ డీపీతో ఘరానా మోసం
దీని వల్ల ఏదో ఒక పరీక్షను నిరుద్యోగులు నష్టపోయే ప్రమాదం వుందన్నారు వెంకట్. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర సంస్థ ఎగ్జామ్ షెడ్యూల్ ముందే నిర్ణయించారు. ఆ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్ నిర్ణయించారు. కేటీఆర్ తో పాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సైతం ఎగ్జాం వాయిదా వేయాలని అభ్యర్ధులు ఫిర్యాదుచేశారు. ఎగ్జామ్ వాయిదా వేయాలని కాంగ్రెస్ పక్షాన ఎన్ఎస్ యూఐi డిమాండ్ చేస్తోందన్నారు. అయినా పట్టించుకోవడం లేదు. మేం మూడురోజులు గడువిస్తున్నాం అనీ, స్పందించకుంటే మంత్రి సబితా ఇంద్రారెడ్డిని అడ్డుకుంటాం. మీకు నిరసన సెగ తప్పదని హెచ్చరించారు. ఎగ్జామ్ వాయిదా వేస్తున్నామని ప్రకటన రాకపోతే మా నిరసనలు కొనసాగిస్తాం అన్నారు. న్యాయస్థానం ఆశ్రయించి లీగల్ గా ముందుకు వెళతాం అని హెచ్చరించారు. ఆగస్ట్ 7 న జరిగే ఎస్ ఐ ఎగ్జామ్ వాయిదా వేయాలని ఆయన మరోమారు డిమాండ్ చేశారు.
YSRCP: అమరావతి చేరిన హిందూపురం వైసీపీ నేతల పంచాయతీ