Site icon NTV Telugu

Balka Suman : సైకో సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండు

ఏప్రిల్ 2వ తేదీ రాత్రి రాడిసన్ బ్లూ హోటల్ లోని పబ్ లో జరిగిన రేవ్ పార్టీలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు పాల్గొన్నారు.
వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మాట్లాడుతూ.. ఈ పబ్‌ ను నిర్వహిస్తున్నవారు బీజేపీ, కాంగ్రెస్‌ నేతల సన్నిహితులేనని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పిల్లలు ఎంత పెద్ద వారు అయినా పోలీసులు వదిలి పెట్టకూడదన్నారు. గతంలో హైదరాబాద్ లో ఉన్న పేకాట క్లబ్ లు అన్ని కాంగ్రెస్ నాయకులవి అని, రేవంత్ రెడ్డి ఎవరిని ఉరి తీయాలో ఇప్పుడు చెప్పాలి.. తన మేనల్లుడు ను ఉరి తీయాలా అని ఆయన ప్రశ్నించారు.

సైకో సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, మద్యం మత్తులో, డ్రగ్స్ మత్తులో ఊగుతున్నది, సాగుతున్నది బీజేపీ కాంగ్రెస్ నాయకులు, వారి పిల్లలేనని ఆయన విమర్శించారు. ఇలాంటివి బంద్ చేయకుంటే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదన్నారు. పార్టీ లో ఎక్కువ ఉన్నది బీజేపీ కాంగ్రెస్ నాయకుల పిల్లలేనని, శ్రీరంగ నీతులు మాట్లాడుతున్న వారిని తెలంగాణ సమాజం గుర్తిస్తోందన్నారు. ప్రభుత్వం ఎంత దూరం అయినా వెళ్తుందని, డ్రగ్స్ మత్తులో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారన్నారు. హైదరాబాద్ ఇమేజ్ ను పడగొట్టే పనులు కాంగ్రెస్, బీజేపీ
నాయకులు బంద్ చేయాలన్నారు.

https://ntvtelugu.com/minister-ktr-says-education-system-needs-to-change/

Exit mobile version