NTV Telugu Site icon

సంజయ్‌ది విహారయాత్ర.. రేవంత్‌కు దమ్ముంటే ఆ పని చేయాలి..!

Balka Suman

Balka Suman

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్.. హన్మకొండ జిల్లా కమలాపూర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బండి సంజయ్‌ది పాదయాత్ర కాదు విహారయాత్ర అని ఎద్దేవా చేశారు.. కాళేశ్వరం ఫలితాలను సంజయ్ చూస్తున్నారని.. పాదయాత్రలో ప్రజలు సమస్యలు చెప్పడం లేదన్న ఆయన.. కేసీఆర్‌ ప్రభుత్వ పథకాలతో సంతోషంగా ఉన్నామని బండి సంజయ్ కి ప్రజలే చెబుతున్నారని.. ఇకనైనా కేసీఆర్‌పై విమర్శలు మానుకోవాలని హితవుపలికారు.. మరోవైపు.. రేవంత్‌రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు బాల్క సుమన్‌.. రేవంత్ బట్టలు ఊడదీసి కొట్టే రోజులు వస్తాయని వ్యాఖ్యానించిన ఆయన.. కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని.. దమ్ముంటే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్‌ చేశారు.