Site icon NTV Telugu

Dr. Laxman: భ‌క్తులు ఇబ్బందులు ప‌డుతున్నా.. ప్ర‌భుత్వానికి ప‌ట్ట‌దా?

Bjp Laman

Bjp Laman

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంకు వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని రాజ్య‌స‌భ స‌భ్యులు డా. ల‌క్ష్మ‌ణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై హైదరాబాద్‌కు వచ్చిన లక్ష్మణ్‌కు బీజేపీ రాష్ట్ర శాఖ ఘనస్వాగతం పలికింది. అనంతరం నాంపల్లిలో ఏర్పాటు చేసిన అభినందన సభలో లక్ష్మణ్‌ మాట్లాడారు. యాదాద్రిలో సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండి ప‌డ్డారు. సరైన సదుపాయాలు కల్పించకుండానే దేవాలయ దర్శనాలకు అనుమతులు ఎలా ఇచ్చారని ప్ర‌శ్నించారు. దేవాలయ నిర్మాణంలో మొదట నుండి ఉన్న చిన్న జీయర్ స్వామి వారిని విస్మరించారని, గవర్నర్ ను గౌరవించడం మర్చిపోయారని డా.ల‌క్ష్మ‌ణ్ నిప్పులు చెరిగారు.

తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిందనేందుకు తన ఎన్నికే నిదర్శనమన్నారు. యూపీ అభివృద్ధిపై గతంలో మంత్రి కేటీఆర్‌ విమర్శలు చేశారని, తనతో పాటు వస్తే ప్రగతిని చూపిస్తానని చెప్పారు. మోదీజీ నేతృత్వంలో నేత్రుత్వంలో కేసీఆర్ పాలనను పెకిలించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. దేశంలోనూ మరో 20 ఏళ్లపాటు మోదీ ప్రభుత్వం కొనసాగనుంది. కేటీఆర్..! తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 2.52 లక్షలు కోట్లు ఇచ్చింది. ఆధారాలతోసహా వివరిస్తా.. రాజీనామా చేయడానికి సిద్దంగా ఉండాలని సవాల్ విసురుతున్నాం.

శ్రీలంకలో ఏ విధంగా అవినీతి, కుటుంబ పాలన కొనసాగడం వల్ల ఆ దేశ ప్రజలు బిచ్చమడిగే పరిస్థితి నెలకొందో…. కేసీఆర్ కుటుంబ అవినీతి-నియంత పాలనవల్ల తెలంగాణ రాష్ట్రం అప్పులపాలై ప్రజలు బిచ్చమెత్తుకునే దుస్థితి నెలకొంది. తెలంగాణలో పేదల బతుకులు బాగుపడాలంటే.. అభివృద్ధి జరగాలంటే బీజేపీతోనే సాధ్యం. అందుకోసం బీజేపీ కార్యకర్తలంతా ఇష్టపడి, కష్టపడి పనిచేయండి. పార్టీ కోసం సమయం వెచ్చించండి. టీఆర్ఎస్ పునాదులు బద్దలు కొడదాం.. గొల్కొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించడమే లక్ష్యంగా పనిచేద్దాం మ‌ని పిలుపు నిచ్చారు.

TDP Gouthu Sirisha : టీడీపీ మహిళా నేతకు సీఐడీ నోటీసులు..

Exit mobile version