హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అవార్డు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (GHIAL) స్కైట్రాక్స్ ప్రపంచ ఎయిర్ పోర్ట్స్ అవార్డులు-2021లో ‘బెస్ట్ రీజనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా & సెంట్రల్ ఏషియా’ అవార్డును గెల్చుకుంది. హైదరాబాద్ విమానాశ్రయం స్కైట్రాక్స్ అవార్డును గెల్చుకోవడం వరుసగా ఇది మూడోసారి. అలాగే ప్రపంచ టాప్ 100 విమానాశ్రయాలలో గత ఏడాది 71వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 64వ స్థానానికి చేరింది. హైదరాబాద్ విమానాశ్రయం ఈ క్రింది విభాగాలలో కూడా అవార్డులు గెల్చుకుంది:
స్కైట్రాక్స్ కొన్ని నెలల క్రితం చాలా విస్తృతంగా ఆన్లైన్ ద్వారా చేపట్టిన ఎయిర్పోర్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ సర్వేను సమీక్షించిన తర్వాత ఈ ఫలితాలను విడుదల చేశారు. ప్రపంచ ఎయిర్‌పోర్టులలో నాణ్యతకు స్కైట్రాక్స్ అవార్డులను గీటురాయిగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 550కి పైగా విమానాశ్రయాలలో కస్టమర్ సేవలను, సౌకర్యాలను పరిశీలించిన అనంతరం వీటిని విడుదల చేస్తారు.
Also Read
ఈ ఫలితాలపై శ్రీ ప్రదీప్ పణికర్, సీఈఓ, జీహెచ్ఐఎఎల్, ‘‘ఈ మహమ్మారి సమయంలో అచంచలమైన నిబద్ధతతో పని చేసిన హైదరాబాద్ విమానాశ్రయ సిబ్బంది, వాటాదారులు, భాగస్వాములందరికీ ఈ అవార్డు అంకితం. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే మా వినూత్న, సాంకేతిక పరిష్కారాలు ఈ విజయానికి దోహదమయ్యాయని భావిస్తున్నాం. ప్రయాణీకులందరికీ మరింత సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు, మా నిబద్ధతను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ గుర్తింపు ప్రేరేపిస్తుంది.’’ అన్నారు.
GMR నేతృత్వంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (DIAL) ఈ ప్రతిష్టాత్మక అవార్డులలో మరొక ప్రధాన విజేతగా నిలిచింది. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డులు 2021లో వరుసగా మూడో ఏడాది ఢిల్లీ విమానాశ్రయం ‘బెస్ట్ ఎయిర్ పోర్ట్ ఇన్ ఇండియా అండ్ సెంట్రల్ ఏషియా’ ఎంపికైంది. 2020లో 50వ స్థానంలో ఉన్న ఢిల్లీ విమానాశ్రయం 2021లో 45వ స్థానానికి చేరుకుని ప్రపంచంలోని టాప్-50 ఎయిర్‌పోర్టులలో చేరింది. కోవిడ్ మహమ్మారి సమయంలో భద్రతా ప్రోటోకాల్‌లను పాటించినందుకు DIAL కి ‘COVID-19 ఎయిర్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డు’ కూడా లభించింది. ఈ కేటగిరీలో భారతదేశంలోని ఏకైక విమానాశ్రయంగా ఇది గుర్తింపు పొందింది.
భారతదేశంలోని ముంబై, బెంగళూరు, చెన్నై విమానాశ్రయాలు, మధ్యఆసియాలో కొలంబో విమానాశ్రయాలను వెనక్కి నెట్టి, ఢిల్లీ విమానాశ్రయం మొదటి ర్యాంకును పొందగా, హైదరాబాద్ విమానాశ్రయం ‘బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా అండ్ సెంట్రల్ ఏషియా’ విభాగంలో రెండో ర్యాంకు పొందింది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?