Insecticide in Cool Drink: కోడలిపై అత్త మామల దాష్టీకం.. కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Insecticide in Cool Drink: కొమురం భీం జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లి ఇష్టం లేక కోడలి పై హత్యాయత్నం చేశారు అత్త, మామల, భర్త. కోడలు గర్భిణీ అని తెలిసి కూడా తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. అన్యోన్యంగా ఉంటూనే వారిపై అనుమానం రాకుండా కోడలు తాగే కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి ఆమెతో తాగించారు. దీంతో పురిటి నొప్పులు రావడంతో హుటా హుటిన ఆసుపత్రికి తరలించగా.. అక్కడ అసలు భాగోతం బట్టబయలు అయ్యింది. పుట్టిన బిడ్డ మరుసటి రోజే మృతి చెందాడు దీనికి గల కారణం పురుగుల మందు తాగడం వలనే బిడ్డ చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. కోడలి పరిస్థితి కూడా కాస్త విషమంగా వుందని వైద్యులు తెలిపారు. అయితే అమ్మాయి తరుపు బంధువులు తల్లిదండ్రులు అత్త, మామ, భర్తపై పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేయండంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని భర్త మహేందర్, అత్త విమల, మామ లహాన్ ల అరెస్ట్ చేశారు పోలీసులు.
Read also: Global Investors Summit: ఏపీలో పెట్టుబడిదారుల సమ్మిట్.. మస్క్, కుక్‌లకు ఆహ్వానం..
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
కొమురం భీం జిల్లా సిర్పూర్ టీ మండలం కేశవ పట్నం కు చెందిన కవిత మహేందర్ ల మధ్య ప్రేమ వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో కవిత గర్భవతి అయ్యింది. తనను పెళ్లి చేసుకోవాలని మహేందర్ ను కవిత కోరగా ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని పెళ్లి వద్దంటూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే.. కవిత , తల్లిదండ్రులు పెద్దల పంచాయితీ పెట్టడంతో గత్యంతరం లేక మహేందర్ కవితను వివాహం చేసుకున్నాడు. అత్త మామ ఇంటికి వచ్చిన కవితపై కర్కసత్వానికి పూనుకున్నారు అత్త,మామ, భర్త ఆమను హతమార్చేందుకు ప్లాన్ వేశారు. వారిచేతికి అంటకుండా ఆమె తాగే కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి ఆమెతో తాగించారు. ఏమీ తెలియనట్లు చేతులు దులుపుకునేందుకు పన్నాగం పన్నారు. అయితే.. పురిటి నొప్పులు రావడంతో కవిత తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా పండెంటి బిడ్డను జన్మనిచ్చింది. అయితే పుట్టిన బిడ్డ మరుసటి రోజే మృతి చెందింది. శిశువు మృతి, కవిత పై హత్యాయత్నం జరిగిందని వైద్యులు నిర్ధారించడంతో.. కవిత తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. భర్త మహేందర్, అత్త విమల,మామ లహాన్ ల అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పుట్టిన రెండో రోజే శిశువు మృతి చెందడంతో కవిత ఆబిడ్డను చూసి కన్నీరు పెట్టుకుంది. గుండెకు హత్తుకుని బోరు ఏడ్చింది. ప్రతి ఒక్కరిని ఆసంఘటన కంటతడిపెట్టించింది.
MLA’s Purchase Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. నేడు విచారణ
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!