హైదరాబాద్‌లో ఓ బాలిక, ఆమె ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు.. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైన ఆ జంట.. ఇవాళ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలయ్య నగర్ వద్ద ఉన్న క్వారీ నీటి గుంటలో శవాలుగా తేలారు.. నీటిపై తేలుతున్న మృతదేహాలను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఈ వ్యవహారం వెలుగుచూసింది.. అయితే, ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక (17), విషాల్ (21) అనే జంట.. కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు.. బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా.. విషాల్.. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు.. ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారం ఇళ్లలో కూడా తెలిసిపోవడంతో.. ఇద్దరి తల్లిదండ్రులు వీరి ప్రేమని ఒప్పుకోనట్టుగా తెలుస్తోంది.. దీంతో.. వారు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా భావిస్తున్నారు. ఇక, 14వ తేదీన జగద్గిరిగుట్ట పీఎస్ లో మిసింగ్ కేసు నమోదు అయ్యింది.. ఇవాళ మృతదేహాలను గుర్తించి.. పోస్టుమార్టం నిర్వహించారు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.