NTV Telugu Site icon

Atrocious Incident: కారుణ్య ఉద్యోగం కోసం దారుణం.. మామను ట్రాక్టర్‌తో గుద్ది చంపిన అల్లుడు..

Atrocious

Atrocious

కారుణ్య నియామకాల్లో ఉద్యోగం కోసం ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు… సింగరేణిలో ఉద్యోగం కోసం మామను ట్రాక్టర్ తో గుద్ది చంపేశాడు అల్లుడు.. భూపాలపల్లి జిల్లాలో జరిగిన దారుణమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కారుణ్య ఉద్యోగం కోసం దారుణాని ఒడిగట్టాడు అల్లుడు… మామను ట్రాక్టర్ తో గుద్ది చంపిన ఘోర ఘటన జిల్లాలోని గణపురం మండలంలో చోటు చేసుకుంది. గణపురం మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గుండ్ల వాగు వద్ద బైక్ పై వస్తున్న మామను.. అల్లుడు ట్రాక్టర్ తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో మామ బండారి ఓదెలు అక్కడికక్కడే మృతి చెందాడు.

Read Also: Munugode Bypoll: మునుగోడు సర్వేలన్నీ బీజేపీకే అనుకూలం..!

అసలు ఉద్యోగం కోసం ఇంత దారుణానికి ఒడిగట్టాల్సిన అవసరం ఏముందనే వివరాల్లోకి వెళ్తే.. వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన బండారి ఓదెలు సింగరేణి ఉద్యోగి. ఆయనకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు నలుగురు కూతుళ్లు. చిన్న భార్యకు కూతురు, కుమారుడు ఉన్నాడు… అయితే, ఆయన త్వరలో వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకొని చిన్న భార్య కొడుక్కు ఉద్యోగం ఇప్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.. కానీ, ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన పెద్ద భార్య రెండో కూతురు భర్త నక్క రమేష్‌.. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఇవాళ సాయంత్రం గుండ్లవాగు వద్ద బైక్‌పై వెళ్తున్న మామాను ట్రాక్టర్ తో ఢీకొట్టి చంపేశాడు. అనంతరం ఆయనే నేరుగా గణపురం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తోంది.