Mahabubabad School Bus Accident: మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెద్దవంగర మండలం బొమ్మకల్లు గ్రామ శివారులో ప్రైవేటు పాఠశాల బస్సును వెనుక నుండి మరో ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొట్టింది. తొర్రూరు మండల కేంద్రానికి చెందిన సెయింట్ పాల్స్ ప్రైవేట్ స్కూల్ బస్సును, రత్న ప్రైవేట్ స్కూల్ బస్సు వెనుక నుండి వచ్చి ఢీకొట్టింది. రెండు ప్రైవేట్ స్కూల్ బస్సులు పోచారం గ్రామంలో విద్యార్థులను ఎక్కించుకొని బొమ్మకల్లు గ్రామ మీదుగా తొర్రూర్ కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వెనుక నుంచి ఢీకొన్న బస్సు ముందు భాగం నుజ్జు అయ్యింది. ముందున్న బస్సు వెనుక కూర్చన్న విద్యార్థులకు భయాందోళనకు గురయ్యారు.
రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్న ఘటనలో విద్యార్థులకు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానిక సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. రత్న ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్ శ్రీనివాస్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసుల వెల్లడించారు. అయితే.. రత్న ప్రైవేట్ పాఠశాల బస్సులో లిఫ్ట్ అడిగి ఎక్కిన వ్యక్తి పరిస్థితి విషమంగా వుండటంతో.. పోలీసులు అతన్ని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతని వివరాలు ఇంకా తెలియాల్సి వున్నాయని అన్నారు. ఈఘటనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ ఎటువంటి భయాందోళనకు గురి కావలసిన అవసరం లేదని అందరి పరిస్థితి నిలకడగానే వుందని పోలీసులు తెలిపారు.
September 17 in Telangana : తెలంగాణలో సెప్టెంబర్ 17 ప్రాముఖ్యత ఏంటి? వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందా.?