ఏసీబీ డీజీగా బాధ్యతలు చేపట్టారు అంజనీ కుమార్. తనని ఏసీబీ డీజీగా నియమించేందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…హైదరాబాద్ కమిషనర్ గా చేసిన పని సంతృప్తినిచ్చింది. అన్ని వర్గాల నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంది. నాతో పాటు కలిసి మూడు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు పనిచేసిన అధికారులకు ధన్యవాదాలు. ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు మా డిపార్ట్మెంట్ ఎంతో సహాయ సహకారాలతో ముందుకెళ్లింది. హైదరాబాదులో ఒక మంచి సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిని ఇన్నాళ్ల పాటు కంటిన్యూ చేశాను. ఏసీబీ డీజీగా నియమించి నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. శాఖాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం అని అంజనీ కుమార్ ప్రకటించారు.