Amit Shah sangareddys tour cancelled: కేంద్రమంత్రి అమిత్ షా మరోసారి తెలంగాణకు రానున్నారు. అయితే అమిత్ షా టూర్ లో స్వల్ప మార్పు జరిగింది. అమిత్ షా సంగారెడ్డి టూర్ రద్దయింది. అయితే ఈ నెల 12న హకీం పేట్‌లో జరిగే సీఐఎస్‌ఎఫ్ పరేడ్‌కు ఆయన యథావిధిగా హాజరవుతున్నారు. కార్యక్రమం ముగిసిన వెంటనే నేరుగా తిరువనంతపురం వెళ్తారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. హకీంపేట కార్యక్రమం ముగించుకుని మధ్యాహ్నం బీజేపీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో నిర్వహించే మేధావుల సమావేశంలో అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. కానీ కేరళలో జరిగిన అత్యవసర సమావేశం కారణంగానే రద్దు చేసినట్లు బీజేపీ శ్రేణులు చెబుతున్నారు. 11వ తేదీ రాత్రి ప్రత్యేక విమానంలో శంషాబాద్ చేరుకుంటారు. అదే రోజు రాత్రి పార్టీ నేతలతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.
Read also: Top Headlines @9AM: టాప్ న్యూస్
కాగా, ఫిబ్రవరి 10న నేషనల్ పోలీస్ అకాడమీ పాసింగ్ ఔట్ పరేడ్ లో పాల్గొనేందుకు అమిత్ షా హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిపై నేతలను అడిగి తెలుసుకున్నారు. గత నెల చివరి వారంలో ముఖ్య నేతలను ఢిల్లీకి పిలిపించారు. కీలక నేతలంతా సమన్వయంతో ముందుకు సాగాలని… బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని దిశానిర్దేశం చేశారు.
Bandi Sanjay: ట్విట్టర్ టిల్లూ నన్ను కెలికితే ఊరుకుంటానా.. అంతకు మించి సినిమా చూపిస్తా