తెలంగాణలో నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన బీజేపీ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం బీజేపీ మేధావులు, ప్రొఫెషనల్స్ సమావేశానికి అమిత్ షా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అమిత్ షా మాట్లాడుతూ.. వచ్చే 5 ఏళ్ల కోసం మూడు పార్టీల మధ్య ఎవరిని ఎన్నుకోవాలి తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు. 2014 ముందు దేశం లో అశాంతి, మహిళ లకు రక్షణ లేదు… యువత ఉద్యోగాలు లేక, పారిశ్రామికవేత్తలు కూడా ఆందోళన.. దేశం ఏమవుతుంది అనే అవేదన ఉండేదన్నారు. 9 ఏళ్ల తర్వాత దేశం పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. మోడీ పైన అవినీతి ఆరోపణలు లేవు.. అంతర్గత రక్షణ పటిష్టంగా తయారు అయింది… పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసామని, విదేశాల్లో భారత్ గౌరవం పెరిగిందన్నారు అమిత్ షా.
అంతేకాకుండా.. ‘ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయింది… మన్మోహన్ సింగ్ చేసింది ఏమి లేదు.. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగు పరచలేక పోయాడు.. కేసీఆర్ తన పార్టీ సిద్దాంతము ఏంటో చెప్పాలి. అయన లక్ష్యం కూతురు ను జైల్ కు వెళ్లకుండా కాపాడుకోవడం, కొడుకును ముఖ్యమంత్రి చేయడం… బీజేపీ సిద్ధాంత పార్టీ. తెలంగాణ భవిష్యత్ ను ఎవరి చేతిలో పెట్టాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి. కరోనా టైమ్ లో దీపాలు వెలిగించాలి అంటే కేటీఆర్ వెటకారం చేశారు. కరోనా వాక్సిన్ ను మోడీ వాక్సిన్ అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కేసీఆర్ నీళ్ళు నిధుల నియామకాలు కోసం ఉద్యమం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో సంపాదించుకున్నాడు. నీళ్ళు ఇవ్వలేదు…
మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు. తెలంగాణ లో మౌలిక వసతులు కల్పన కోసం లక్షల కోట్లు ఇచ్చారు.. ఏడున్నర లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు చేశావో కెసిఆర్ చెప్పాలి. కేసీఆర్ నీకు ఇమ్మత్ ఉంటే నీ రెండు మేనిఫెస్టో లను చదువు. ఉద్యోగ నియామకాలు చేయలేదు.. కెసిఆర్ ఫెయిల్ అయ్యాడు. తెలంగాణ ప్రజల ఓటు అడిగే హక్కు కెసిఆర్ నీకు లేదు… దేశాన్ని మహోన్నత స్థానం కి తీసుకెళ్లే మోడీ తో తెలంగాణ ఉంటుందా… కొడుకు ను సీఎం చేయాలని అనుకుంటున్న కెసిఆర్ తో ఉంటుందా తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలి. కేసీఆర్‌తో ఎప్పుడు కలిసేది లేదు… కలిసి వెళ్ళేది లేదు… కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లకు ఓటు వేస్తే అవినీతి ప్రభుత్వం వస్తుంది… అభివృద్ది తెలంగాణ బీజేపీ తోనే సాధ్యం…’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
