Site icon NTV Telugu

Vemula Prashanth Reddy: తెలంగాణ విముక్తికి అల్లూరి పోరాడారట..

Vemula

Vemula

రాష్ట్ర అవతరణ దినోత్సవంలో అల్లూరి సీత రామరాజును తెలంగాణ ఉద్యమ కారునిగా కొలిచారని బీజేపీ నేతలు వ్యాఖ్య‌ల‌పై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలకు తెలంగాణపై ఉన్న సోయి ఏంటో అర్థం అయిందని ఎద్దేవ చేశారు. అమిత్ షా చెప్పిన అబద్ధాలకు కిషన్ రెడ్డి బసవన్నలా తలవూప‌డం విడ్డూరంగా వుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆవిర్భావ వేడుకల్లో పచ్చి అబద్దాలు మాట్లాడారని మండి ప‌డ్డారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై కేటీఆర్ సవాల్ కు ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదని ఎద్దేవ చేశారు.

కేంద్రం నుండి 3 లక్షల 65 వేళా కోట్లు ఇవ్వాల్సి ఉండ‌గా లక్ష 65 కోట్లు మాత్రమే ఇచ్చారని విరుచుకుప‌డ్డారు. కానీ అమిత్ షా 2 లక్షల 52 వేలా కోట్లు ఇచ్చారు అని అబద్దాలు మాట్లాడారని నిప్పులు చ‌రిగారు.సిగ్గు లేకుండా ముద్ర లోన్లు , ఈఎస్ఐ , మెట్రో ఇచ్చిన నిధులను కూడా వీటిలో కలిపి చెప్పుకుంటున్నారని మండిప‌డ్డారు. కేంద్రంతో బాగుంటే మరో లక్ష కోట్లు వచ్చేవని అమిత్ షా అన్నారు, అంటే కోట్లు ఎగ్గొట్టారు అని చెప్పినట్లే కదా అని ప్ర‌శ్నించారు. దమ్ముంటే కిషన్ రెడ్డి , బండి సంజయ్ లు రాష్ట్రానికి రావాల్సిన లక్ష కోట్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

అయితే.. తాజాగా కేంద్ర‌ హోంమంత్రి అమిత్‌షా ఢిల్లీలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌ల్లో అల్లూరి సీతారామరాజు తెలంగాణ విముక్తి కోసం రాంజీగోండు, కొమురంభీంతో కలిసి నిజాంపై పోరాటం చేశారంటూ వ్యాఖ్యానించారు. దీంతో తెలంగాణ చరిత్రపై కనీస అవగాహన లేకుండా అమిత్‌షా మాట్లాడిన మాట‌లు ఇప్పుడు షోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

Health Tips: నీరు ఎక్కువ తాగుతున్నారా.. ? అయితే..

Exit mobile version