NTV Telugu Site icon

Amit Shah and JP Nadda: బీహార్‌లో అమిత్‌షా.. పదేపదే తెలంగాణ ప్రస్తావన..! ఏంటి విషయం..?

Amit Shah And Jp Nadda

Amit Shah And Jp Nadda

కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్‌షా.. తన బీహార్‌ పర్యటనలో పదే పదే తెలంగాణ ప్రస్తావన తీసుకువచ్చారు.. పాట్నాలో జరిగిన వివిధ మోర్చాల జాతీయ సమావేశాల్లో పాల్గొన్న షా.. తెలంగాణ బీజేపీ శాఖ చేస్తున్న పోరాటాలను ప్రస్తావించారు… తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలను, ఉద్యమాలను అమిత్‌షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పదే పదే ప్రస్తావించారు. తెలంగాణలో చేస్తున్న పోరాటాల స్ఫూర్తితో మోర్చాల నేతలు పనిచేయాలని పిలుపునిచ్చారు.. అంతేకాదు.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న పేర్కొన్నారు అమిత్‌షా..

Read also: Raja Singh: యోగి కాళ్ళు నొక్కండి..! సీఎం గారు.. కొద్దిగా గైడెన్స్ వస్తుంది..

బీహార్ రాష్ట్రం పాట్నాలో నాలుగు రోజుల పాటు అంటే జులై 28 నుండి 31వ తేదీ వరకు వివిధ మోర్చాల జాతీయ సంయుక్త సమావేశాలు జరిగాయి.. ఈ సమావేశాలకు హాజరైన అమిత్‌షా, జేపీ నడ్డా.. తెలంగాణలోని 119 నియోజకవర్గాల పరిధిలో ఇటీవల జాతీయ నాయకులు రెండు రోజులపాటు క్షేత్ర స్థాయిలో పర్యటించిన విషయాన్ని ప్రస్తావించారు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేస్తున్న పోరాటాలను పదేపడే ప్రస్తావించారు అగ్రనేతలు, తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలను పలుమార్లు ప్రస్తావించడంతో చపట్లతో హర్షం వ్యక్తం చేశారు వివిధ మోర్చాలకు చెందిన తెలంగాణ నాయకులు.. బీహార్‌లో రెండోసారి విజయవంతంగా అధికారంలోకి వచ్చిన విషయాన్ని కూడా సమావేశంలో పేర్కొన్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జెండా పాతేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ.. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌ వేదికగా నిర్వహించడం.. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభ నిర్వహించి సత్తా చాటారు.. సభ వేదికపై నుంచి జనాన్ని చూసిన ప్రధాని నరేంద్ర మోడీ.. బండి సంజయ్‌ని అభినందించిన విషయం తెలిసిందే.. ఇక, గత రెండు మూడు పర్యటనల్లోనూ.. బీజేపీ తెలంగాణ చీఫ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు అమిత్‌షా.

Show comments