Medaram jatara ready: మేడారం జాతరకు అంతా సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా ప్రసిద్దిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర-2022 కు రంగం సిద్ధం అయింది. కరోనా ఇబ్బందులు వున్నా జాతర నిర్వహణకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. జాతర జరుగుతుందో లేదో అని భక్తుల్లో ఉన్న అపోహలను మంత్రులు తొలగించారు. ఈ సారి గరిగే సమ్మక్క-సారలమ్మ మహా జాతరను వైభవంగా నిర్వహిస్తామని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్, డీజీపీ ప్రకటించారు. మేడారం జాతర నిర్వహణ తో పాటు మేడారం జాతరకు చవ్చే భక్తుల అవసరాల కోసం చేపట్టిన పనుల తీరు పైనా క్లేత్ర స్థాయిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశంలో మహా జాతర నిర్వహణపై క్లారిటీ ఇచ్చారు, కరోనా నేపథ్యంలో అమ్మవారి గద్దెలు, జంపన్న వాగులో శానిటేషన్ పకడ్బందీగా చేపడుతూ.. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర సాగిస్తామని స్పష్టం చేశారు. మహాజాతర నిర్వహించడానికి ఎలాంటి అడ్డంకులు లేవన్న మంత్రులు అధికారులు. 4 రోజుల పాటు జరిగే మహాజాతర ఘట్టంలో కోటిన్నరమంది భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ఏర్పట్లు చేశారు.
జాతర నిర్వహణ కోసం మొత్తం ప్రాంతాన్ని 8 జోన్లుగా, 34 సెక్టర్లుగా విభజించారు అదికారులు. 1100 ఎకరాల్లో 30 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు . జాతర సమయంలో పారిశుధ్య నిర్వహణకు 450 మంది సబ్ సెక్టోరియల్ ఆఫీసర్లు, 50 మంది సెక్టరియల్ అధికారులను నియమించారు.మొత్తం 4000 మందిని పారిశుధ్య నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తున్నారు. వీరితో పాటు జాతర సమయంలో దుమ్ము లేవకుండా ఉండడానికి 30 ట్రాక్టర్లు, చెత్త తొలగింపునకు 8 జేసీబీలు, 20 టాటా ఏస్ వాహనాలతో సేకరించిన చెత్తను వినియోగించనున్నారు. డంప్ యార్డుకు తరలించడానికి 70 ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. భక్తుల సౌకర్యం కోసం 200 డస్ట్ బిన్స్ సిద్ధం చేశారు.
Also Read
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ఇక జాతరలో భక్తుల ఆరోగ్య పరిరక్షణకు 50 బెడ్లతో సమ్మక్క సారలమ్మ ప్రత్యేక వైద్యశాలను ఏర్పాటు చేశారు స్థానికంగా ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 6 పడకల వైద్యశాల, మరో 19 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు వీటితో పాటు ములుగులో, ఏటూరునాగారం, వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులు, తాడ్వాయి10 పడకల ఆరోగ్య కేంద్రం, పస్రాలోని 5 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వినియోగించుకునేలా రెడీ చేశామన్నారు. ఇవి కాకుండా మేడారం వచ్చే 8 మార్గాల్లో మార్గం పొడవున 42 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర వైద్య సదుపాయం కోసం 15 అంబులెన్సు లు, 15 బైక్ అంబులెన్సులను అందుబాటులో ఉంచారు..
ఇక భక్తుల రక్షణ కోసం ఎలాంటి సమస్య రాకుండా ఉండదుకు గత జాతర మాదిరిగానే ఈసారి కూడా 10,300 మంది పోలీస్ సిబ్బందిని జాతర నిర్వహవణలో వినియోగించనున్నారు పోలీసు అధికారులు. ప్రతి 4 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంప్, పస్త్రా నుంచి ప్రతి 2 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంప్, టోయింగ్ వాహనాలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంచారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 28.5 లక్షల వ్యయంతో తప్పిపోయిన వారి కోసం 6 సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తుల రవాణా సదుపాయాల కోసం 3,845 బస్సులను సిద్దం చేశారు.
జాతర కంటే ముందే భక్తులు మేడారంకు పోటెత్త్తారు. కరోనా భయంతో ముందస్తు మొక్కులకు పెద్ద ఎత్తున భక్తులు మేడారంకు చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో మేడారం కిక్కిరిసిపోయింది. జాతర ప్రారంభానికి ముందే మేడారం భక్తులతో కళకళలాడుతోంది.
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పునుగొండ్ల లో ముస్తాబయ్యారు సమ్మక్క భర్త పగిడిద్దరాజు. నేడు పునుగొండ్ల లో పెనుక వంశీయులు స్వామి వారి పడిగ తీసుకుని ఆటవీమార్గం గుండా పస్రా, ప్రాజెక్టు నగర్, కన్నేపల్లి మీదుగా 80కిలో మీటర్లు కాలినడకన మేడారం రేపు మధ్యాహ్నం వరకు చేరుకుంటారు. పగిడిద్దరాజు దేవాలయాన్ని ముస్తాబు చేయడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. అనంతరం ఈనెల 23నుండి పునుగొండ్ల లో తిరగువారం జాతర ఘనంగా నిర్వహిస్తారు.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!