Akbaruddin Owaisi : అక్బరుద్దీన్ ఒవైసీ ఫైర్.. సభలో రూల్స్‌పై బిగ్ ప్రశ్న.!
- టీషర్ట్ ఘటనను గుర్తుచేసిన ఒవైసీ
- చిత్రాలు ప్రదర్శించడంపై ప్రశ్న
- అధికార, విపక్షాలకు వేర్వేరు రూల్సా?
- రూల్స్ ఒప్పుకుంటే.. మేమూ వస్తాం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akbaruddin Owaisi : తెలంగాణ శాసనసభలో సభ నిబంధనల అమలుపై AIMIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో నిబంధనలు ప్రతిపక్ష సభ్యులకు ఒకలా, అధికార పార్టీ సభ్యులకు మరోలా ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. అందరికీ సమానంగా నిబంధనలు వర్తించేలా చూడాలని కోరారు.
టీ-షర్ట్ ఘటనను గుర్తుచేసిన ఒవైసీ
గతంలో తమ పార్టీకి చెందిన సభ్యుడు టీ-షర్ట్ ధరించి సభకు వచ్చినప్పుడు.. దానిపై ఉన్న అక్షరాలను చూపిస్తూ అభ్యంతరం వ్యక్తం చేసి, సభలోకి అనుమతించలేదని అక్బరుద్దీన్ ఒవైసీ గుర్తుచేశారు. అప్పట్లో నిబంధనలను కఠినంగా అమలు చేశారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం కొందరు సభ్యులు సభలో చిత్రాలను ప్రదర్శిస్తున్నా ఎవరూ అడ్డుకోవడం లేదని ఆయన అన్నారు. ఒకరికి వర్తించే నిబంధనలు మరొకరికి కూడా వర్తించాల్సిందేనని స్పష్టం చేశారు. సభలో ఏదైనా ప్రదర్శన నిబంధనలకు విరుద్ధమైతే.. అది ఏ పార్టీ సభ్యుడైనా సరే అడ్డుకోవాలని కోరారు.
Also Read
అధికార, ప్రతిపక్షాలకు వేర్వేరు రూల్సా?
సభలో అధికార, ప్రతిపక్ష సభ్యులకు వేర్వేరు నిబంధనలు ఉండటం సరికాదని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ట్రెజరీ బెంచ్ సభ్యులైనా, ప్రతిపక్ష సభ్యులైనా ఒకే రకమైన నిబంధనలు పాటించాల్సిందేనని పేర్కొన్నారు. నిబంధనలు అనుమతించకపోతే తాము కూడా చిత్రాలతో సభకు వస్తామని అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. సభలో అందరికీ సమాన న్యాయం, సమాన నిబంధనలు ఉండాలన్నదే తమ అభిప్రాయమని స్పష్టం చేశారు. సభా నియమాలను పక్షపాతం లేకుండా అమలు చేయాలని కోరారు.
తాజావార్తలు
-
Akbaruddin Owaisi : అక్బరుద్దీన్ ఒవైసీ ఫైర్.. సభలో రూల్స్‌పై బిగ్ ప్రశ్న.!
-
BRAOU Ph.D: అంబేద్కర్ వర్సిటీలో పీహెచ్డీ ప్రోగ్రామ్స్.. నోటిఫికేషన్ విడుదల.. ఏ ఏ సబ్జెక్టుల్లో అంటే..
-
Bandi Sanjay : మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరు అమానుషం
-
YouTuber Nandu : నాకేం సంబంధం లేదు అంతా మా ఆయనే.. విచారణకి సహకరించని రమా నందన
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!