Mallanna Jatara: ఐనవోలు జాతరకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 4 గంటలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallanna Jatara: వరంగల్ జిల్లా ఐనవోలు జాతరకు భక్తులు పోటెత్తారు. భోగి పర్వదినం, ఆదివారం సెలవు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. మల్లన్న దర్శనానికి 4 గంటలకు పైగా సమయం పడతుంది. ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో వీఐపీల సందడి చేశారు. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామిని కుటుంబ సమేతంగా మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ దర్శించుకునేందుకు వచ్చారు. ఐనవోలు మల్లన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read also: Ponnam Prabhakar: జ్యోతిషం చెప్పినట్లు ఉంది.. బండి సంజయ్ పై పొన్నం ప్రభాకర్ ఫైర్..
Also Read
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లన్న జాతర నిన్న ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ భోగి, రేపు (15న) సంక్రాంతి, 16న కనుమ పండుగ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రజలు కొంగుబంగారంగా కొలిచే అయిలోని మల్లన్న ఉత్సవాలకు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి దాదాపు 10 లక్షల మంది తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు సంక్రాంతి నుంచి ప్రారంభమై ఉగాది వరకు కొనసాగుతాయి. అధికారులతో పాటు ఆలయ కమిటీ కూడా భక్తుల రాకపోకలకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా పకడ్బందీ ఏర్పాటు పూర్తీ చేశారు. ఆలయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.
Harish Rao: ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు ఫోన్.. కారణం ఇదీ..
తాజావార్తలు
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!