Site icon NTV Telugu

AICC Ajay Kumar : హెల్త్ శాఖలో జరిగిన పనులకు బిల్లులు కూడా రావడం లేదు

Telangana Congress

Telangana Congress

కేసీఆర్ అవినీతి, ఆస్తులపై వీడియో ప్రదర్శించారు ఏఐసీసీ మీడియా పరిశీలకులు అజయ్ కుమార్. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ.. సారు.. కారు మళ్ళీ రారు.. మేము.కారు తెచ్చి పెడితే పోలీసులు లేకుండా చేశారు.. పోలీసులు కూడా కారు ను లేకుండా చేస్తున్నారన్నారు. వైద్యం విషయంలో చాలా దారుణంగా ఉందని, గర్భిణీ మహిళలకు సరైన రక్తం దొరకడం లేదు.. అధిక శాతం ప్రజలకు న్యూట్రీషన్ ఫుడ్ దొరకడం లేదన్నారు అజయ్‌ కుమార్‌. హెల్త్ మౌలిక సదుపాయాల విషయంలో దేశంలో తెలంగాణ 14వ స్థానంలో ఉందని, హెల్త్ శాఖలో జరిగిన పనులకు బిల్లులు కూడా రావడం లేదన్నారు. దేశంలో ప్రైవేట్ వైద్యం తెలంగాణలో ఎక్కువ జరుగుతుందని, 70 శాతం పిల్లలకు వైద్యం విషయంలో నిర్లక్ష్యం జరుగుతుందన్నారు.

Also Read : Israel-Hamas War: గాజాపై అణుదాడి, ఇజ్రాయిల్ మంత్రి వ్యాఖ్యలు.. స్పందించిన పీఎం నెతన్యాహు

అనంతరం సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు మల్లు రవి మాట్లాడుతూ.. ‘తెలంగాణ లో పదేళ్ల నుంచి వైద్య, ఆరోగ్యం విషయంలో కేసీఆర్ చాలా నిర్లక్ష్యం చేశారు. 2014, 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరలేదు. మండల కేంద్రంలో 30, నియోజకవర్గంలో 100 పడకలు, జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతాం అన్నారు. కానీ ఒక్క హామీ నెరవేరలేదు.. అడిగే స్వేచ ప్రజలకు లేదు .. తెలంగాణ లో నిర్బంధం కొనసాగుతుంది. హెల్త్,ఫామిలీ వెళ్ఫెర్ లలో 12, 735 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. డాక్టర్ పోస్ట్ లు 2,659 ఖాళీలు ఉన్నాయి.. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు 1.183 ఖాళీలు ఉన్నాయి.. ఇలా ఉంటే వైద్య విద్య ఎలా సాగుతుంది. నర్సింగ్ హాస్పిటల్ లో డాక్టర్ 3,823 పోస్టులు, ఖాళీలు, 1100 నర్సింగ్ పోస్ట్ ఖాళీలు ఉన్నాయి.. పదేళ్లలో మాటల గారడి తో నడుస్తుంది. బడ్జెట్ కూడా 2 శాతం తక్కువ.’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Anam Venkata Ramana Reddy: పేదలెవరో, పెత్తందార్లు ఎవరో జగనే చెప్పాలి..

Exit mobile version