తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరుణుడు కాస్త శాంతించాడు. గత కొద్దిరోజులుగా ఎడతెరపిలేకుండా, తన ప్రతాపాన్ని చూపి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాడు. అయితే నిన్న సాయంత్రం 6 గంటలనుంచి కాస్త శాంతించాడు. అయితే మళ్లీ 18 తర్వాత విజృంభించేందుకు అవకాశమున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న (గురువారం) ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా జయశంకర్ జిల్లా రేగులగూడెం, మంచిర్యాల చెన్నూరు లలో 6.2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
read also: Booster Dose: నేటి నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా బూస్టర్ డోస్
మొన్న (బుధవారం) వరకు కొద్దిగంటల్లోనే 10 సెం.మీ.లకు పైగా కురిసిన, కుండపోత వర్షాల తీవ్రత గురువారం ఉదయం పడకలేదు. ఇక నేడు రేపు (శుక్ర, శని) వారాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు లేవని, కానీ.. ఈ నెల 18 తరువాత మళ్లీ భారీ వర్ష సూచనలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న చెప్పారు. అయితే.. బుధవారం, గురువారం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. వాన ఎక్కువగా.. నిర్మల్ జిల్లా ఖానాపూర్.. పాత ఎల్లాపూర్‌లలో 29.4 సెం.మీ. కురవగా.. కరీంనగర్ జిల్లా ఆర్నకొండలో 23, గుండిలో 21.2 సెం.మీ. వర్షం కురిసింది.
ఇక నగరంలో సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని, గరిష్టంగా రెండు సెం.మీ కూడా కురవకపోవచ్చని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే బలపడివున్నా అది ఆగ్నేయ దిశగా మారి మరింతగా సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉన్నదని, అందువల్లనే వానలు కురిసే ప్రభావం తగ్గతూ వస్తుందని వివరించింది.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?