K.A.Paul: తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన మునుగోడు ఉప ఎన్నికలో కీలక ఘట్టమైన పోలింగ్ ముగిసింది. ఓట్ల లెక్కింపుకు ఇక 24గంటలే వుంది. ఈనేపథ్యంలో.. నిన్న నల్లగొండలోని ఓ హోటల్ లో మీడియా సమావేశంలో ఇండిపెండెంట్అభ్యర్థి, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మాట్లాడారు. ప్రపంచంలోని 155 దేశాలు తిరిగానని.. మునుగోడు ప్రజలు చూపించిన ప్రేమ ఎక్కడా లభించలేదనిత తెలిపారు. ఇక..వేరే పార్టీలు రూ.కోట్లు పంచినా తాను ఒక్క రూపాయి ఇవ్వలేదు అయినా తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోనే మోస్ట్ కమర్షియల్ బైపోల్ ఇది అని అన్నారు. అయితే.. సీఐ చంద్రశేఖర్‌రెడ్డి తనపై దాడి చేశారు.. పక్కనే ఉన్న ఎస్పీ రెమా రాజేశ్వరి పట్టించుకోకుండా ఎంకరేజ్ చేశారని ఆరోపించారు. ఆ దశలో ఎన్‌కౌంటర్ చేయిస్తారేమోనని కే.ఏ.పాల్ భయపడ్డానని.. సీఆర్పీఎఫ్ జవాన్ తో కొట్టించేందుకు ప్రయత్నించారని.. మునుగోడు ఎన్నికలో తనపై మూడు సార్లు దాడి జరిగిందని సంచళన వ్యాక్యలు చేశారు.
Read also: Twitter: ట్విట్టర్‌కు షాక్.. యాడ్స్ నిలిపివేసిన ప్రముఖ సంస్థలు..
మునుగోడు ఉపఎన్నికల్లో 1.05 లక్షల మంది యువత తనకే ఓటేశారని.. కనీసం 50వేల మెజార్టీతో గెలవడం పక్కా అని పోలింగ్ ముగిసిన తర్వాత తెలిపారు. అందరూ తనకు కంగ్రాట్స్ చెబుతున్నారని.. కేసీఆర్ ఎంత అవినీతి చేసినప్పటికీ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారని తెలిపారు. 2 రోజులు ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలను కాపాడుకుందామని యువతకు పిలుపునిచ్చారు. గురువారం ఉపఎన్నిక జరిగితే ఆదివారం కౌంటింగ్ చేయడం ఏంటన్నారు. కోర్టు చెప్పినా తనకు ఎందుకు సెక్యూరిటీ, గన్ మెన్లను ఇవ్వట్లేదని అడిగారు. ఈవీఎంలను మ్యానుప్యులేట్, రీప్లేస్ చేస్తున్నారని ఆరోపించారు. డాన్‌బాస్కో కాలేజీ నుంచి 200 ఖాళీ ఈవీఎంలు తరలిస్తున్నారని, ఆ ట్రక్ మాయమైందని.. ఇక..మునుగోడు లాంటి అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. అంతేకాకుండా.. ప్రపంచ దేశాలన్ని తనను గౌరవిస్తుంటే కేసీఆర్ మాత్రం క్రిమినల్‌గా చూస్తున్నారని ఆరోపించారు.
Elon Musk: అలా జరుగుతోంది.. కాబట్టే ఇలా ఉద్యోగులను తీస్తేస్తున్నాను