Site icon NTV Telugu

Nagoba Jatara: నాగోబా ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

Goba

Goba

Nagoba Jatara: ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఘనంగా నాగోబా జాతర కొనసాగుతుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు పురుషులు కలిసికట్టుగా కాలినడకన వెళ్లి నాగోబా ప్రతిమను ఊరేగిస్తూ సంప్రదాయ వాయిద్యాల మధ్య ఆలయానికి తీసుకెళ్లారు. ఇక, ఆలయానికి చేరుకున్న తర్వాత మెస్రం వంశీయులు తమ సంప్రదాయ పద్దతిలో పూజలు నిర్వహించారు. మొదటగా మెస్రం పెద్దలు 22 కితల్లోని మహిళలు, ఆడపడుచులకు కొత్త కుండలను ఇవ్వగా.. ఆడపడుచులు, మహిళలు, అల్లుళ్లు కలిసి ఒక వరుసలో తలపై కుండలను మోసుకుంటూ వెళ్లి కోనేరు దగ్గర ఉన్న జలాన్ని సేకరించి అదే వరుసలో తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత నాగోబా ఆలయంలోని బౌల సతీ దేవత ముందు ఏడు వరుసలతో తయారు చేసిన దేవతామూర్తులను ప్రతిష్టించారు.

Read Also: Pragya Jaiswal: బాలకృష్ణతో వరుస ఆఫర్లపై ప్రజ్ఞా జైస్వాల్ వైరల్ కామెంట్స్..

ఇక, మంగళవారం నాడు రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య నాగోబాకు మహాపూజ చేశారు. దీంతో ఈరోజు ఉదయం నుంచి సంప్రదాయ పూజలతో నాగోబా జాతరను మొదలు పెట్టారు. అయితే, జాతర ప్రారంభం కావడంతో మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, కర్ణాటక, ఏపీలోని సరిహద్దు ప్రాంతాల ప్రజలు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో, అధికారులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తులకు కావాల్సిన కనీస వసతులను జిల్లా అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. ఇక, ఈ జాతరలో కీలకమైన ప్రజాదర్బార్‌ లో జనవరి 31వ తేదీన జరగనుంది.. దీనికి మంత్రులు సీతక్క, కొండ సురేఖతో పాటు జిల్లా కలెక్టర్‌, వివిధ శాఖల అధికారులు హాజరు అవుతారని పేర్కొన్నారు.


Exit mobile version