Site icon NTV Telugu

Nagoba Jatara: రేపటి నుంచి నాగోబా జాతర.. పటిష్ట బందోబస్తు

Nagoba

Nagoba

రేపటి నుంచి నాగోబా జాతర మొదలవనుంది. మంగళవారం రాత్రి నాగోబాకు మెస్రం వంశీయులు మహాపూజ చేయనున్నారు. కాగా.. కేస్లాపూర్ నాగోబా జాతర రేపు రాత్రి గంగాజలాభిషేకం, మహా పూజతో ప్రారంభమై ఫిబ్రవరి 4వ తేదీ వరకు జరుగుతుంది. ఆదిశేషుని నాగోబా జాతర దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర కావడం తెలంగాణకు ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. రేపు మెస్రం వంశస్థులు పవిత్ర గోదావరి జలాన్ని కొత్త కుండలతో కడెం మండలంలోని గొడిసిర్యాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని కాలినడకన తీసుకొచ్చి.. నాగోబాను అభిషేకిస్తారు. రాత్రంతా నాగదైవానికి మహాపూజ నిర్వహిస్తారు. మరోవైపు.. నాగోబా జాతరకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.. 600 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు.. నాగోబా జాతర సందర్భంగా భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో రెండో అతి పెద్ద గిరిజన జాతర నాగోబా అని అన్నారు. నాగోబా జాతరకు రాష్ట్రం నుంచి కాకుండా.. మధ్యప్రదేశ్, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో గిరిజనులు తరలిరానున్నారు.

Read Also: Champions Trophy 2025: రేపటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫి టికెట్లు విడుదల.. టీమిండియా ఫ్యాన్స్ కు షాక్!

రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో జరిగే నాగోబా జాతరకు.. పోలీస్ శాఖ పూర్తి సంసిద్ధతతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసిందని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపీఎస్ తెలిపారు. స్థానిక నాగోబా దర్బార్ హాల్ నందు నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ పాల్గొని సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. మెస్రం వంశీయులు సాంప్రదాయాలు నడుము పండగను జాతరను నిర్వహిస్తారని వారి సాంప్రదాయాలను గౌరవిస్తూ నడుచుకోవాలని సిబ్బందికి సూచించారు. జాతర బందోబస్తుకు వచ్చిన సిబ్బందికి నిత్యవసర వస్తువులతో కూడిన ఒక ప్రత్యేక కిట్టును అందజేశారు. జాతర మొత్తాన్ని ఆరు సెక్టార్లుగా విభజించి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగిందని, తమకు కేటాయించిన స్థలాలలో మూడు షిఫ్టుల నందు సిబ్బంది ఎల్లవేళలా హాజరుతో ఉంటూ విధులను నిర్వర్తించాలని సూచించారు.

Read Also: Nandamuri Balakrishna: బాలకృష్ణని ఘనంగా సన్మానించిన ‘అఖండ 2: తాండవం’ టీం

Exit mobile version