Site icon NTV Telugu

Adilabad: ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాల పేరుతో మోసం.. నిందితుల అరెస్ట్..

Arrest

Arrest

ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఫేక్ జాబ్ ఐడి కార్డులను ఫేక్ లెటర్లను తయారుచేసి బాధితులను మోసం చేసి వారి వద్ద నుంచి ఏడు లక్షల ఐదువేల రూపాయలను వసూలు చేసిన నిందితుడు హైదరాబాద్ అల్కాపురి కాలనీకి చెందిన వినయ్ కుమార్‌ను అరెస్టు చేశామని ఆదిలాబాద్ ఒకటో పట్టణ సీఐ బి సునీల్ కుమార్ తెలిపారు. బాధితుడు గంగాధర్ ఫిర్యాదుతో ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు వినయ్ కుమార్ ను నిన్న(గురువారం) అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

READ MORE: Maheshwar Reddy: దేశ భద్రత పై సీఎం చేసిన వ్యాఖ్యలు దేశద్రోహ చ‌ర్యతో స‌మానం..

విచారణలో వినయ్ తో పాటు రమేష్ అనే వ్యక్తి కూడా నేరం చేసినట్లు తెలిసిందని, అతనిపై కూడా కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుని వద్ద నుంచి ఒక సెల్ ఫోను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికే మాటలు చెప్పే వారి మాయమాటలు నమ్మవద్దని సీఐ సునీల్ సూచించారు. ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించాలని తెలిపారు. జిల్లా పోలీసు యంత్రంగా ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.

Exit mobile version