ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఫేక్ జాబ్ ఐడి కార్డులను ఫేక్ లెటర్లను తయారుచేసి బాధితులను మోసం చేసి వారి వద్ద నుంచి ఏడు లక్షల ఐదువేల రూపాయలను వసూలు చేసిన నిందితుడు హైదరాబాద్ అల్కాపురి కాలనీకి చెందిన వినయ్ కుమార్‌ను అరెస్టు చేశామని ఆదిలాబాద్ ఒకటో పట్టణ సీఐ బి సునీల్ కుమార్ తెలిపారు. బాధితుడు గంగాధర్ ఫిర్యాదుతో ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
నార్సింగిలో యువకుడిని దారుణంగా హత్య చేశారు. అల్కపూరి కాలనీ లో ఐడిపిఎల్ కు చెందిన రోహిత్ అనే యువకుడిని స్నేహితులు కొట్టి చంపేశారు. స్నేహితుడు అక్బర్ పుట్టిన రోజు వేడుకలో పాల్గొనడానికి ఐడీపీఎస్ నుంచి అల్కాపూర్ కాలనీకి వచ్చాడు. బర్త్ డే పార్టీలో స్నేహితులు ఫుల్ గా మద్యం సేవించారు. అనంతరం రోహిత్ పై దాడి చేశారు.