Fake Job Alert: ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న ఘటన తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరుతో ఓ సంస్థ ఆదిలాబాద్ లోని ఉట్నూర్, జైనూర్ ప్రాంతాల్లో బ్రాంచ్‌లను ఏర్పాటు చేసి, సుమారు 300 మందిని ఉద్యోగానికి ఎంపిక చేసినట్టు చెబుతూ ఒక్కో అభ్యర్థి దగ్గర 20 వేల రూపాయల చొప్పున వసూలు చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
Read Also: Vegetable Price: అర్థ సెంచరీకి దగ్గరలో కూరగాయల ధరలు.. సెంచరీకి చేరువలో ఇంగ్లిష్ వెజిటేబుల్స్!
అయితే, కృష్ణ అనే వ్యక్తి ఈ బ్రాంచ్‌లను నడిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఉద్యోగాలు రాకపోవడం, వేతనాలు కూడా ఇవ్వకపోవడంతో బాధితులు సంస్థ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. 2 నెలలుగా తిరుగుతున్నా సరైన స్పందన రాకపోవడంతో చివరకు తాము మోసపోయామని గుర్తించారు బాధితులు. ఇక, తమ దగ్గర వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇవ్వాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మోసపోయిన వాళ్లు పోలీసులను ఆశ్రయించారు.
