Fake Certificates: గద్వాల జిల్లా వ్యవసాయ శాఖలో నకిలీ సర్టిఫికేట్‌ల వ్యవహారం సంచలనం సృష్టించింది. ఫేక్ సర్టిఫికేట్‌లతో ఉద్యోగాలు పొందిన పలువురు అసిస్టెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు (AEO) అధికారుల గుట్టు బయటపడింది. వీరు ఉత్తరప్రదేశ్‌లో వ్యవసాయ విద్యను అభ్యసించినట్లు దొంగ డిగ్రీలు సృష్టించుకుని ఉద్యోగాల్లో చేరినట్లు గుర్తించారు. ఈ నకిలీ సర్టిఫికేట్ వ్యవహారంపై అధికారికంగా విచారణ జరుగుతోంది. ఇప్పటివరకు ఏడుగురు ఉద్యోగుల నకిలీ డిగ్రీలపై అధికారులు దృష్టి సారించి విచారణ చేపట్టారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో ఎలాంటి…