Adilabad : మండుతున్న ఎండలు .. ఎడతెగని ఉక్కపోత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. కొన్ని జిల్లాలు అగ్నిగుండాలను తలపిస్తున్నాయి. ఉదయం 8 గంటలకు ఇళ్ల నుంచి కాలు బయటపెట్టే అవకాశం ఉండటం లేదు. అంతలా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటలు దాటితే కానీ ఎండలు తగ్గడం లేదు. రికార్డ్ స్థాయిలో 45 డిగ్రీలు దాటి టెంపరేచర్స్ నమోదు అవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం ఆకాశం మేఘాలతో ఉండీ విభిన్న వాతావరణం కనిపిస్తోంది.
కాగా..ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మండే ఎండలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. భానుడి ప్రతాపానికి తోడు ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరొకొన్ని చోట్ల అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు నిప్పుల కుంపటిలా మారాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ లో గడిచిన 24 గంటల్లో 44 డిగ్రీలుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జైనాథ్ లో 44 డిగ్రీలు. ఆదిలాబాద్ అర్బన్ లో 43.6 డిగ్రీలు. బోరాజ్ లో 43.5 గా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైంది. భానుడి భగభగలకు ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
Also Read
- Bhatti Vikramarka: రాహుల్ గాంధీ అరెస్టు.. రాజ్యాంగాన్ని అవమానించడమే..!
- CM Revanth: విద్యార్థులపై దాడులు అమానుషం.. నీట్ వ్యవహారంపై కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్..!
- Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
- Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
అయితే వారం రోజులుగా ఎండ తీవ్రత పెరుగుతుండటంతో.. జనాలు అల్లాడిపోతున్నారు.దీంతో.. వేసవిలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక మండే ఎండ ధాటికి మధ్యాహ్నం ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. కొందరు ఎండవేడి నుంచి రక్షణ కోసం గొడుగులు, టవల్స్ అడ్డుపెట్టుకోగా మహిళలు చున్నీలను కప్పుకుని తిరుగుతుండడం కనిపిస్తోంది.
ఎండలు పెరుగుతుండటంతో రైతన్నల పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. జిల్లాలో సజ్జ, పత్తి, ఇతర పంటలు సాగులో ఉన్నాయి. పొలాలు నీరు కట్టేందుకు పగటి పూట వెళ్లాల్సి వస్తుండటంతో ఎండ ధాటికి ఇబ్బందులు పడుతున్నారు రైతన్నలు. పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు అతలాకుతలం చేస్తుంటే.. మండే ఎండలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా భానుడు కనికరించి చల్లని వాతావరణం కల్పించకపోతాడా అంటూ ఆకాశం వైపు రైతులు ఆశగా ఎదురు చూసే పరిస్థితి నెలకొంది.
బీజేపీలో చేరికలకు తెలంగాణలో కొందరు కమలనాధులు అడ్డుపడుతున్నారా..?
తాజావార్తలు
-
Bengaluru Crime: త్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. AI సాయంతో ముగ్గురిని లేపేశాడు!
-
Virat Kohli and Anushka Sharma: బురదలో చెప్పులు లేకుండా నడిచిన విరాట్, అనుష్క.. స్టార్ కపుల్ బృందావన్ వీడియో వైరల్..
-
IND vs ZIM: భారత్‌తో టీ20 సిరీస్.. జింబాబ్వే జట్టు ప్రకటన.. స్టార్లను కూడా వణికించే పేసర్‌కు చోటు!
-
Anantnag Terror Attack: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి.. కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి
-
NEET Abolition: నీట్‌పై ‘దళపతి’ సంచలన డిమాండ్.. అసలు నీట్ పరీక్షను రాష్ట్రాలు రద్దు చేయగలవా?
ట్రెండింగ్
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్‌ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!