బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తిప్పికొట్టారు. రాష్ట్రంలో ఏం జరిగినా సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేయడం బీఆర్ఎస్‌కు అలవాటైపోయిందన్నారు. ‘‘38 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లో చేర్చుకున్నప్పుడు ఫిరాయింపులు బీఆర్ఎస్‌కు గుర్తుకురాలేదా?, ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రులను చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. తీర్పు కాపీలు తొందరగా రావు.. ఆ విషయం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలియదా?, న్యాయపోరాటం చేసుకొవచ్చు… మాకు అభ్యంతరం లేదు.’’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి: Harish Rao: రాజ్యాంగంపై ఢిల్లీలో ఉపన్యాసాలు.. తెలంగాణలో ఇంకొక వైఖరా?
‘‘ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాల్సిందే. సభాపతి ఇరుపక్షాల వాదనలు విని మెరిట్ ఆధారంగా తీర్చు ఇచ్చారు. స్పీకర్‌పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కూడా ఫిరాయింపులపైన మాట్లాడడం ఆశ్చర్యం. టీడీపీ ఎమ్మెల్యే తలసానిని కేబినెట్‌లోకి తీసుకోవడం మరిచిపోయారా? కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్న విషయం మరిచిపోయారా?, 10 ఏళ్లలో 39 మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకోవడం మరిచిపోయారా?.’’ అని నిలదీశారు.
ఇది కూడా చదవండి: Supreme Court: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్.. టోల్‌ప్లాజాల మూసివేతకు ఆదేశం
‘‘ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే బీఆర్ఎస్ పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేశారు. స్పీకర్ తీర్పు పైన బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్లొచ్చు.. ఇంకా పైకోర్టులకు వెళ్లొచ్చు. తమకు అనుకూలంగా తీర్పు వస్తే ఒక విధంగా.. రాకపోతే మరో విధంగా బీఆర్ఎస్ మాట్లాడుతోంది. స్పీకర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు దశల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా కడుపు మంటతో బీఆర్ఎస్ నాయకులు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. కేసీఆర్‌లా మా సీఎం అప్రజాస్వామికంగా పాలన చేయడం లేదు. పదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. స్పీకర్ తీర్పుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. మెస్సీ లాంటి దిగ్గజ్జ ఫుట్‌బాల్ ఆటగాడు హైదరాబాద్‌కు వచ్చినా ఓర్వలేకపోతున్నారు.’’ అని ధ్వజమెత్తారు.
