MLA Laxmareddy: జడ్చర్ల మున్సిపాలిటీలోని 10, 11వ వార్డుల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవ్వా పెన్షన్ అందుతుందా.. ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. అవ్వ, తాత అందరికీ ప్రతినెలా పెన్షన్ అందుతుందా అంటూ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అందరిని ఆప్యాయంగా పలకరించారు.
లక్ష్మారెడ్డి రెడ్డి మాటలకు ప్రజలు ఆనందిస్తూ అందుతున్నాయి సార్ అంటూ సమాధానం చెప్పారు. గత ప్రభుత్వాలు 200 పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకున్నాయని అన్నారు. నేడు రూ.2 వేలు పెన్షన్ అందజేస్తూ సర్కారు వృద్ధులను కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే తమకు తాగునీటి కష్టాలు తీరాయని వార్డులో మహిళలు ఎమ్మెల్యేకు వివరించారు.
వార్డులోని ప్రతి గల్లీలో తిరుగుతూ ప్రభుత్వ పథకాలుపై ఎమ్మెల్యే ఆరా తీశారు. సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పధకాలను రూపొందించి ప్రతి ఇంట్లో పెళ్ళిలకు అందజేస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఐదు ఏండ్లల్లో ప్రస్తుతం ఉన్నా పెన్షన్లు, రైతుబంధును పెంచుతామని పేర్కొన్నారు.
సౌభాగ్యలక్ష్మీ పథకం కింద గృహిణులకు నెలకు మూడు వేలు రూపాయలను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జడ్చర్ల మరింత అభివృద్ధి బాటలో పయనించాలంటే మళ్ళీ కారు గుర్తుకే అందరూ ఓటేసి తనను ఆశీర్వదించాలని కోరారు.
Ponnam Prabhakar: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది