MLA Laxmareddy: జడ్చర్ల మున్సిపాలిటీలోని 10 , 11వ వార్డుల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవ్వా పెన్షన్ అందుతుందా.. ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు.
జడ్చర్ల మున్సిపాలిటీలోని పాతబజార్ 13వ వార్డు, 22వ వార్డుల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే తమకు తాగునీటి కష్టాలు తీరాయని ఈ సందర్భంగా వార్డులో మహిళలు ఎమ్మెల్యేకు వివరించారు.
జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో మండల పరిధిలోని గోప్లపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుర్రాల నర్సింహులు, మల్లెపోగు యాదయ్య, శివతో పాటు 30 మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.