NTV Telugu Site icon

Chain Snatching: ఓరేయ్‌ ఎంట్రా ఇదీ.. సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ దొంగతనాలు ఎంట్రా బాబు

Chain Snatching1

Chain Snatching1

Chain Snatching: అతను సాప్ట్‌వేర్‌ ఉద్యోగి.. క్రికెట్‌ అంటే ప్రాణమే కాదండోయ్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ లకు అలవాడు పడి లక్షల్లో అప్పుల పాలయ్యాడు. మరి అవి తీర్చాలంటే ఒక్క సాప్ట్‌ వేర్‌ జాబ్‌ చేస్తే ఎలా అనుకున్నాడు సాఫ్ట్‌ వేర్‌ సారు. అందుకని ఏంచేయాలని ఆలోచనలో పడ్డాడు. మైండ్‌ లో ఒక థాట్‌ వచ్చింది. ఈజీగా అప్పులు తీర్చేయచ్చు అనుకుని దొంగతనాలు చేసి అప్పులు తీర్చేద్దాం అని దొంగతనాలు చేయడం స్టార్ట్‌ చేశాడు. చివరికి పోలీసులకు పట్టుపడ్డాడు. ఈఘటన మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Read also: Telangana Assembly: గవర్నర్ బడ్జెట్ ప్రసంగం.. నేడు ధన్యవాద తీర్మానం

శ్రీకాకుళం పాతపట్నం ప్రాంతానికి చెందిన సవన మనోజ్ కుమార్ ఎంబీఏ పూర్తి చేసి ప్రగతినగర్ లేక్ యూ కాలనీలో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసైన అతడు ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేవాడు. 5 నుంచి 10 శాతం వడ్డీకి అప్పులు తీసుకుని మరీ బెట్టింగ్‌లు వేసి ఓడిపోయాడు. ఆ అప్పులు తీర్చేందుకు సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. గత నెల 31వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నిజాంపేట శ్రీనివాస కాలనీలోని శ్రీ బాలాజీ రెసిడెన్సీకి చెందిన ఓ వృద్ధురాలు స్వర్ణలత సాయిబాబా ఆలయానికి వెళ్లింది. పూజ ముగించుకుని ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో వెంబడించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి మనోజ్ కుమార్ ఇంటి వద్ద ఉన్న లిఫ్ట్ దగ్గర చైన్ పగలగొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శశిగూడలో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఏసిపి చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు. మియాపూర్‌లో చోరీ చేసిన స్కూటీ, రెండున్నర తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Bhuma Akhila Priya: ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్