Hyderabad Water Board : ఏసీబీ దాడుల్లో షాక్.. బయటపడ్డ కోట్ల సామ్రాజ్యం.!
- వాటర్ బోర్డు జీఎం ఇళ్లపై ఏసీబీ మెరుపు దాడులు
- 9 ప్రాంతాల్లో ఏకకాల సోదాలతో బయటపడిన భారీ ఆస్తులు
- 2.1 కిలోల బంగారం, కోట్ల నగదు స్వాధీనం
- మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైగా ఉండొచ్చని అనుమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Water Board : భాగ్యనగరంలో అవినీతి నిరోధక శాఖ (ACB) మరో భారీ తిమింగలాన్ని బుట్టలో వేసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ స్వరేజ్ Board (HMWS & SB) జనరల్ మేనేజర్ నివాసాలపై ఏసీబీ అధికారులు సంచలన దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో కిలోల కొద్దీ బంగారం, టన్నుల కొద్దీ వెండి, కోట్లలో నగదు బయటపడటం నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది.
రెడ్ హిల్స్‌లోని ప్రాజెక్ట్ డివిజన్-VIII లో జనరల్ మేనేజర్ (ఇంజినీరింగ్)గా పనిచేస్తున్న సాగ్గం అనంత లక్ష్మీ కుమార్, తన అధికారిక ఆదాయ వనరులకు మించి అవినీతి మార్గాల్లో కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో నిఘా పెట్టిన అధికారులు, ప్రాథమిక ఆధారాలు సేకరించిన అనంతరం అవినీతి నిరోధక చట్టం 1988 (2018 సవరణ)లోని సెక్షన్ 13(1)(b), 13(2) కింద కేసు నమోదు చేశారు.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీకి తేదీ ఫిక్స్..
- Koti Deepotsavam 2026 Day 6: కార్తీక శుద్ధ దశమి.. కోటి దీపోత్సవంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..!
- Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
- Food Safety Raids: హైదరాబాద్ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ కొరడా.. 4 రెస్టారెంట్ల లైసెన్సులు సస్పెండ్, 2 సీజ్..
ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజాము నుంచే ఏసీబీ తెలంగాణ అధికారులు రంగంలోకి దిగారు. ఏఎల్ కుమార్ నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన మొత్తం 9 ప్రదేశాల్లో ఒకేసారి ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. అధికారులు ఇళ్లలోకి అడుగుపెట్టాక అక్కడ లభించిన ఆస్తులు, నగదు చూసి నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ దాడుల్లో నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కలిపి ఏకంగా 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటితో పాటు వివిధ ప్రాంతాల్లో 6 ఓపెన్ ప్లాట్లు, హైదరాబాద్ మహానగరంలో 3 లగ్జరీ ఫ్లాట్లు, ఒక సొంత ఇల్లు ఉన్నట్లు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇళ్లలో కట్టల కొద్దీ దాచి ఉంచిన సుమారు రూ. 1.10 కోట్ల లిక్విడ్ క్యాష్, ఏకంగా 2.1 కిలోల బంగారు ఆభరణాలు, 9.2 కిలోల వెండి వస్తువులతో పాటు ఒక మారుతి రిట్జ్ కారు, ఒక బజాజ్ మోటార్ బైక్‌ను ఏసీబీ కనుగొంది.
ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాల ప్రభుత్వ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ రూ. 5,88,55,490 (రూ. 5.88 కోట్లు)గా లెక్కగట్టారు. అయితే, ప్రస్తుత ఓపెన్ మార్కెట్ రేట్ల ప్రకారం వీటి విలువ వంద కోట్ల రూపాయలకు పైనే ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ అక్రమాస్తుల కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, సదరు అధికారికి చెందిన మరికొన్ని లాకర్లు, ఇతర అదనపు ఆస్తులపై విచారణ కొనసాగుతోందని ఏసీబీ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ దాడి అవినీతి అధికారుల గుండెల్లో మరోసారి వణుకు పుట్టించింది.
తాజావార్తలు
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
Akvan Cyclone Alert: మళ్లీ ఉత్తరాంధ్ర తీరంవైపు అక్వాన్ తుఫాన్..! మరో 36 గంటలు అలర్ట్
-
Mohamed Siraj Dropped: సిరాజ్‌ను అందుకే పక్కన పెట్టాం?.. అసలు విషయం చెప్పిన కెప్టెన్ గిల్!
-
International Men’s Day: “నువ్వు మగాడివి.. ఏడవకూడదు”.. నవ్వుతూ కనిపించే ప్రతి పురుషుడి వెనుక ఓ కన్నీటి గాథ..
-
Gold and Silver Prices: కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. మరోసారి భారీగా బంగారం, వెండి ధరల పతనం..
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..