టీఆర్ఎస్ నేత నందు బిలాల్‌పై కేసు నమోదు చేశారు అబిడ్స్ పోలీసులు.. ఎంజే మార్కెట్ వద్ద అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతుండగా మైక్ లాగిన ఘటనలో.. నందు బిలాల్ పై సుమోటో కింద కేసు నమోదు చేశారు అబిడ్స్ పోలీసులు. మరోవైపు.. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భగవంతరావుపై కూడా కేసు నమోదైంఇ… నంద కిషోర్ బిలాల్.. మరియు భగవంతరావు పై ఐపీసీ సెక్షన్ 354, 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.. కాగా, హైదరాబాద్ వినాయక నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు అసోం సీఎం.. హిమంత బిస్వా శర్మ.. మొజంజహీ మార్కెట్ దగ్గర.. భాగ్యనగర్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన స్టేజ్ ఎక్కి ఆయన మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం విషయంలో.. టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు.. దీంతో, అక్కడే ఉన్న టీఆర్ఎస్ నేత నందు బిలాల్.. ఆయన దగ్గర నుంచి మైక్ లాక్కున్న విషయం తెలిసిందే.
Security breach at Assam CM: అసోం సీఎం మైక్ లాగిన టీఆర్ఎస్ నేతపై కేసు నమోదు

Nand Kishore Vyas Bila